ఆ విషయంలో 'యాత్ర' సక్సెస్ అవుతుందా?

Update: 2019-02-09 17:30 GMT
స్వర్గస్తులైన నాయకుల బయోపిక్స్ ఇప్పుడు టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ గా మారింది. మొన్న సంక్రాంతి సంధర్భంగా ఎన్టీఆర్ బయోపిక్ ప్రేక్షకుల ముందుకు రాగా, నిన్న 'యాత్ర' పేరుతో వైఎస్ ఆర్ బయోపిక్ ప్రేక్షకుల ముందుకు వచ్చి - ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటుంది. అయితే సినిమా సక్సెస్ మాట పక్కన పెడితే - ఈ సినిమా గురించి ఇప్పుడు ప్రేక్షకుల్లోనే కాదు - అటు రాజకీయ వర్గాల్లో కూడా భారీ చర్చ నడుస్తుంది. అదేంటి అంటే. యాత్ర 'సక్సెస్' రేపు రాబోయే ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అని.

నిజమే...అటు రాజకీయ, ఇటు సినిమా వర్గాల ప్రకారం ఈ సినిమా ప్రభావం వచ్చే ఎన్నికల్లో చాలా బలమైన ప్రభావం చూపిస్తుంది అని తెలుస్తుంది. దానికి గల కారణాలు ఏంటి అంటే, దీన్ని సినిమాగా కంటే వైఎస్ ఆర్ యాత్రలో భాగంగా ఆయన ప్రజల కోసం ఆలోచించిన విధానాన్ని - ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆయన తీసుకువచ్చిన సంస్కరణలని స్పష్టంగా చూపించారు. అంతేకాదు ఈ సినిమా కొన్ని డైలాగ్స్ అయితే ఖచ్చితంగా ప్రేక్షకుల మనసుల్లోకి చొచ్చుకు పోయేలా ఉన్నాయి. వైఎస్ ఆర్ గురించి చాలా మందికి తెలియని ఎన్నో భావోద్వేగాలను ఈ సినిమాలో స్పష్టంగా చూపించారు. 2009 ఎలా అయిన అయితే తెచ్చిన సంస్కరణలకు ప్రజలు పట్టం కట్టారో - అదే విధంగా ఈ సారి మళ్లీ ఆయన్ని గుర్తు చేసుకుంటూ ప్రజలు జగన్ వెనుక నిలుస్తారు అని చెప్పవచ్చు.

అసలే ఎన్నికల వ్యవహారం నువ్వా-నేనా  అన్నట్లుగా ఉంది. మరో పక్క జగన్ కూడా  తన పాదయాత్రతో ప్రజల్లోకి దూసుకు పోయారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే, ఈ సినిమా ఎఫెక్ట్ కూడా ప్రజల్లో ఉంటే మాత్రం జగన్ అనుకున్న స్థాయిని చేరుకోవడం పెద్ద కష్టం ఏమీ కాదు అని చెప్పవచ్చు. చూద్దాం మరి ప్రజలు 2019 ఎన్నికల సంగ్రామానికి ఎలాంటి ఫలితాన్ని అందిస్తారో.

Tags:    

Similar News