బిగ్ బాస్ 8 : మెగా ఛీఫ్ రేసు కోసం రంగంలో దిగింది ఎవరంటే..?

ఈ క్రమంలో ఆ ముగ్గురిని డైరెక్ట్ గా మెగా చీఫ్ కంటెండర్ గా ఛాన్స్ పొందారని చెప్పాడు బిగ్ బాస్.

Update: 2024-11-06 04:56 GMT

బిగ్ బాస్ సీజన్ 8 లో 10వ వారం నామినేషన్ ఫైట్ ముగిశాక కంటెస్టెంట్ మధ్య మెగా చీఫ్ టాస్క్ షురూ చేశాడు బిగ్ బాస్. ఈ క్రమంలో గార్డెన్ ఏరియాలో మూడు సూట్ కేస్ లను పెట్టిన బిగ్ బాస్ వాటి మీద ఎవరు నన్ను తీసుకుంటారు అని రాసి పెట్టాడు. ఐతే ఆ సూట్ కేస్ తీసుకుంటే రిస్క్ లో పడే ఛాన్స్ ఉంటుందని మిగతా హౌస్ మెట్స్ వెనకడుగు వేయగా నబీల్, రోహిణి, పృధ్వి మాత్రం వాటిని తీసుకున్నారు. ఈ క్రమంలో ఆ ముగ్గురిని డైరెక్ట్ గా మెగా చీఫ్ కంటెండర్ గా ఛాన్స్ పొందారని చెప్పాడు బిగ్ బాస్.

ఐతే దీని కోసం ఆ ముగ్గురు మరో టాస్క్ ఆడాల్సి ఉంది. ఐతే వారితో ఆడే పోటీ దారుడిని వాళ్లే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మొదటి టాస్క్ లో లక్డీకపూల్ అంటూ ఒక టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో రోహిణి హరితేజని చూస్ చేసుకుని ఆడింది. ఈ టాస్క్ లో రోహిణి విజేతగా నిలిచి తన కంటెండర్ షిప్ ని కన్ఫర్మ్ చేసుకుంది. ఇక రోహిణి టాస్క్ గెలిచినందుకు ఆమెకు హౌస్ మెట్స్ లో మరొకరిని కంటెండర్ గా ఎంపిక చేయొచ్చు. అలా చేసిన వారికి సూట్ కేస్ ఇవ్వాల్సి ఉంటుంది. రోహిణి యష్మిని ఎంపిక చేసి సూట్ కేస్ ఇచ్చింది.

ఇక రెండో కంటెండర్ టాస్క్ లో నబీల్ తో గౌతం పోటీ పడ్డాడు. బోర్డ్ మీద ఇచ్చిన ఆకారాలను అమర్చాల్సి ఉంటుంది. ఐతే ఈ టాస్క్ లో గౌతం నబీల్ కి గట్టి పోటీ ఇచ్చాడు. ఫైనల్ గా నబీలే ఈ టాస్క్ విజేతగా నిలిచి మెగా చీఫ్ కంటెండర్ గా కన్ ఫర్మ్ అయ్యాడు. నబీల్ కూడా మిగతా హౌస్ మెట్స్ లో యష్మిని కంటెండర్ గా ఎంపిక చేస్తూ సూట్ కేస్ ఇచ్చాడు.

నెక్స్ట్ టాస్క్ పృధ్వి ఆడాల్సి ఉంది. ప్రస్తుతం రోహిణి, నబీల్ కన్ ఫర్మ్ మెగా చీఫ్ కంటెండర్ గా ఉండగా.. ప్రేరణ, యష్మి కంటెండర్ రేసులో ఉన్నారు. సో నెక్స్ట్ టాస్క్ లో దాదాపు మెగా చీఫ్ ఎవరన్నది కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక ఈ వారం హౌస్ నుంచి నామినేట్ అయిన వారికి ఆడియన్స్ తమ ఓటింగ్స్ వేస్తున్నారు. మొన్నటి వరకు టాప్ ఓటింగ్ తో నిఖిల్ ఒక్కడే దూసుకెళ్తుండగా పోటీగా గౌతం వచ్చి అతనికి గట్టి ఫైట్ ఇస్తున్నాడు.

Tags:    

Similar News