గత కొంత కాలంగా సరైన సక్సెస్ లేక రేస్ లో కాస్త వెనుక బడ్డ కింగ్ షారుఖ్ ఖాన్ గట్టిగానే బౌన్స్ బ్యాక్ అయ్యేలా ఉన్నాడు. జీరో పేరుతో రూపొందుతున్న మూవీ ట్రైలర్ ఇవాళ ముంబైలో గ్రాండ్ గా రిలీజ్ చేసారు. కాన్సెప్ట్ విషయానికి వస్తా చాలా విభిన్నంగా కొత్తగా ట్రై చేసినట్టు ముందు నుంచి చెబుతున్న మాటలు అక్షరాల నిజమే అనిపిస్తుంది.
ఎత్తు తక్కువగా ఉండి ఆత్మ నూన్యత లేకుండా తనకు తగ్గ జోడి కోసం వెతుకుతూ మరుగుజ్జులాంటి పర్సనాలిటీతో ఉండే వ్యక్తి బవా సింగ్(షారుఖ్ ఖాన్). అతనికి ఆఫియా(అనుష్క శర్మ) ఫోటో చూసి మొదటిచూపులోనే ప్రేమ పుడుతుంది. తీరా చూస్తే ఆఫియాకు తన కంటే పెద్ద వైకల్యం ఉందని తెలుసుకుని షాక్ అవుతాడు. కాళ్ళు చచ్చుబడిపోయి నోట మాట కూడా సరిగా మాట్లాడలేని పక్షవాతంతో ఉన్న ఆఫియాను చూసి షాక్ తింటాడు. అయినా తన మీద అభిమానాన్ని ప్రేమగా మలుచుకుంటాడు. సరిగా అదే టైంలో హీరొయిన్ గా గొప్ప పేరున్న కత్రిన కైఫ్ షారుఖ్ జీవితంలో అడుగు పెడుతుంది. దగ్గర కూడా అవుతుంది. ఈ క్రమంలో ఇద్దరిలో ఒకరినే ఎంచుకునే అయోమయంలో పడిపోతాడు. మరి జీరో హీరో ఎలా అయ్యాడు అనేదే కాన్సెప్ట్ గా కనిపిస్తోంది
ట్రైలర్ లో కథను అరటిపండు వలిచినట్టు చెప్పేసారు కాని కీలకమైన ట్విస్ట్ మాత్రం చూపించి చూపించకుండా సస్పెన్స్ లో పెట్టేసారు. పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే షారుఖ్ కెరీర్ బెస్ట్ అనిపించే వాటిలో జీరోకు ఫస్ట్ ప్లేస్ వచ్చేలా ఎంత చేయాలో అంతా చేసినట్టు ప్రతి ఫ్రేమ్ లో అతని బెస్ట్ ని చూడొచ్చు. భేషజం లేకుండా బనియన్ నిక్కరుతో రోడ్లమీద పిచ్చోడిలా పరిగెత్తే సీన్ చేయాలంటే చాలా ధైర్యం కావాలి. షారుఖ్ ఖాన్ అలాంటివి ఇందులో చాలా చేసాడు. అనుష్క శర్మ జీవించేసింది. ఎమోషన్స్ కు పెద్ద పీట వేసినా జీరోలో స్పేస్ షిప్ కి సంబంధించి ఏదో ట్విస్ట్ ఉంది కానీ అది రివీల్ చేయలేదు. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన జీరో డిసెంబర్ 21న విడుదల కానుంది.
Full View