మరో వెరైటీ కథని రెడీ చేసిన 'జాంబీ రెడ్డి' డైరెక్టర్..?

Update: 2022-04-29 10:30 GMT
తెలుగులో డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో కమర్షియల్ ఎంటర్టైనర్ లను రూపొందిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. 'అ!' చిత్రంతో డైరెక్టర్ గా పరిచయమైన ప్రశాంత్.. తొలి సినిమాతోనే జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాడు.

ఈ క్రమంలో 'కల్కి' సినిమాతో తన మార్క్ ని నిలబెట్టుకున్న యువ దర్శకుడు.. 'జోంబీ రెడ్డి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు జాంబీలను పరిచయం చేశాడు. అలానే 'అద్భుతం' సినిమాకు కథ అందించారు. ఇప్పటి వరకు డిఫరెంట్ జోనర్స్ సినిమాలతో కమర్షియల్ సక్సెస్ అందుకున్న ప్రశాంత్ వర్మ.. ఇప్పుడు మరో రెండు సరికొత్త సినిమాలను సెట్స్ మీదకు తీసుకొచ్చారు.

తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ 'హను-మాన్' అనే పాన్ ఇండియా మూవీ తెరకెక్కిస్తున్నారు. ఇది తొలి తెలుగు సూపర్ హీరో సినిమాగా పేర్కొనబడింది. దీని తర్వాత నిర్మాత దానయ్య తనయుడిని హీరోగా లాంచ్ చేస్తూ 'అధీరా' అనే మరో సూపర్ హీరో మూవీ చేయనున్నాడు.

అయితే ఈ సినిమా అనంతరం ప్రశాంత్ వర్మ వైరైటీ స్క్రిప్ట్ తో మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నాడని టాక్ వినిపిస్తోంది. పది మంది హీరోయిన్లతో యంగ్ డైరెక్టర్ ఓ డిఫరెంట్ సబ్జెక్ట్ ని రాసుకున్నాడట. పాత్రకి మరో పాత్రకి లింక్ చేస్తూ భిన్నమైన స్క్రీన్ ప్లేతో ఈ కథని చెప్పబోతున్నాడట.

ఇప్పటికే ఒక హీరోయిన్ పాత్ర కోసం అనుపమా పరమేశ్వరన్ ను సంప్రదించగా.. ఆమె వెంటనే ఓకే చెప్పిందని టాక్. మిగతా తొమ్మిది పాత్రల కోసం ప్రముఖ హీరోయిన్లనే తీసుకోవాలనే ఆలోచన వున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధి​కారిక ప్రకటన వెలువడనుందని అంటున్నారు.

పది మంది హీరోయిన్లతో సినిమా అంటే ఇప్పటి వరకు తెలుగులో చేయడానికి ఎవరూ సాహసించని.. సరికొత్త ప్రయత్నమనే చెప్పాలి. వెరైటీ జోనర్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న ప్రశాంత్ వర్మ.. ఈసారి ఎలాంటి అనుభూతిని పంచుతారో చూడాలి.
Tags:    

Similar News