ఎనర్జిటిక్ హీరో రణ్‌వీర్ సింగ్- ఆలియాభట్ జంటగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం `గల్లీ బోయ్`. హీరో కం దర్శకనిర్మాత ఫర్హాన్ సోదరి జోయా అక్తర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రితేష్ సిద్వాణి-జోయా అక్తర్-ఫర్హాన్ అక్తర్ ఈ చిత్రానికి నిర్మాతలు. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించడమే గాక 2019 బ్లాక్ బస్టర్ హిట్స్ జాబితాలో టాప్ 10లో నిలిచింది.
తాజాగా ఈ సినిమా మరో సంచలనానికి కేరాఫ్ అడ్రెస్ గా నిలిచింది. మొత్తం 27 దేశీ సినిమాలతో పోటీపడి ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో ఇండియా తరపు నుంచి ఆస్కార్ 2020కి ఎంపికైంది. ఆ మేరకు ఫర్హాన్ అక్తర్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఫిలింఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్.ఎఫ్.ఐ) పోటీబరిలో ఉన్న సినిమాలను పరిశీలించి గల్లీ బోయ్ ని ఏకగ్రీవంగా ఎంపిక చేసిందని ఎఫ్.ఎఫ్.ఐ జనరల్ సెక్రటరీ సుప్రన్ సేన్ ప్రకటించారు. ఈ ఏడాది ఆస్కార్ ఇండియా జూరీ కమిటీకి అపర్ణాసేన్ అధ్యక్షురాలిగా ఉన్నారు.
రణవీర్ సింగ్- ఆలియా భట్ జంటగా నటించిన ఈ సినిమాలో కంటెంట్ పై క్రిటిక్స్ ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ముంబైలో ఒక గల్లీ నుంచి ర్యాపర్ గా ఎదిగిన కుర్రాడి కథ ఇది. నిజ జీవితంలోని ఎమోషన్ ని తెరపై ఆవిష్కరించడంలో జోయా పనితనానికి వందశాతం మార్కులేశారు విమర్శకులు. రణవీర్ - ఆలియా జంట నటనకు పేరొచ్చింది. 92వ అకాడెమీ(ఆస్కార్) అవార్డుల్లో (ఆస్కార్స్) ప్రపంచ సినిమాతో పోటీపడి గల్లీ బోయ్ ఆస్కార్ లు గెలుచుకుంటుందా లేదా? అన్నది చూడాలి.