దిల్ రాజు - శిరీష్ గొడవలు.. ఆశిష్ రెడ్డి ఏమన్నాడంటే..

ఇప్పటికే కొన్నిసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఫైనల్ గా ఈ వారం విడుదలకు సిద్దమవుతోంది.

Update: 2024-05-22 14:21 GMT

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో డిఫరెంట్ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇప్పటివరకు హారర్ థ్రిల్లర్ జానర్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ కొత్త దర్శకుడు "లవ్ మీ" అనే సినిమాతో హారర్ ప్లస్ న్యూ ఏజ్ లవ్ స్టొరీ ని హైలెట్ చేయబోతున్నాడు. ఇప్పటికే కొన్నిసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఫైనల్ గా ఈ వారం విడుదలకు సిద్దమవుతోంది. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న ఆషిష్, ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.

ఇక ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో స్టార్ నిర్మాతలుగా ఉన్న అన్నదమ్ములు దిల్ రాజు - శిరీష్ మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రశ్న ఆషిష్‌కు ఎదురైంది. ఆ ప్రశ్నకు స్పందించిన ఆషిష్, “అవి పూర్తిగా అవాస్తవాలు. మా నాన్న (శిరీష్) మరియు దిల్ రాజు గార్ల మధ్య ఎలాంటి విభేదాలు లేవు అని స్పష్టంగా చెప్పగలను. ఇలాంటి విషయాలు మా ఇంట్లో జరిగే అవకాశం లేదు. మా కుటుంబం చాలా మంచి అనుబంధాన్ని కలిగి ఉంది.

ఇలాంటి ఫేక్ వార్తలు కేవలం పనిలేకుండా ఉన్న వాళ్ళు సృష్టిస్తారు. ఏం రాయాలో తెలియకపోయినా వారు ఇలాంటి అబద్ధాలు సృష్టిస్తారు. ఈ రకమైన గాసిప్స్ వాస్తవంగా చూపించడానికి ప్రయత్నిస్తారు. ఇటువంటి అసత్య వార్తలు పరిశ్రమలోనే ఉత్పన్నమవుతాయి. మా కుటుంబంలో అయితే ఎలాంటి విభేదాలు లేవు" అని అన్నారు.

ఆషిష్ ఇదివరకే "రౌడీ బాయ్స్" సినిమాతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఆ సినిమా పెద్ద విజయం సాధించలేకపోయినా, "లవ్ మీ" సినిమాతో మంచి బ్రేక్ పొందాలని ఆశిస్తున్నాడు. ఈ సినిమాలో వైష్ణవి చైతన్య కథానాయికగా నటిస్తున్నారు. దిల్ రాజు మరియు శిరీష్ మధ్య విభేదాల అంశం ప్రస్తుతం పరిశ్రమలో చర్చనీయాంశమవుతుండగా, ఆషిష్ ఈ రూమర్స్‌ను తిప్పికొట్టిన తీరు హాట్ టాపిక్ గా మారింది.

ఫైనల్ గా దిల్ రాజు కుటుంబంలో అనుబంధం మరియు సాన్నిహిత్యం బలంగా ఉన్నాయని, ఇలాంటి విభేదాలు తలెత్తవని ఆయన మాటల్లో స్పష్టమవుతోంది. మరోవైపు, "లవ్ మీ" సినిమా ఈ శనివారం విడుదల కాబోతోంది. ఈ సినిమా విజయవంతం కావాలని, తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవాలని ఆషిష్ ఎంతో ఆశిస్తున్నాడు. మరి ఆయన ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలైమ్

Tags:    

Similar News