బతికే ఉన్నా అని ఎందుకు అన్నానంటే...!
తెలుగు ప్రేక్షకులతో పాటు అన్ని భాషల సినీ ప్రేక్షకులకు విలక్షణ నటుడు ఆశీష్ విద్యార్థి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు
తెలుగు ప్రేక్షకులతో పాటు అన్ని భాషల సినీ ప్రేక్షకులకు విలక్షణ నటుడు ఆశీష్ విద్యార్థి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 1991 లో కాల్ సంధ్య అనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. రెండు దశాబ్దాల పాటు నటుడిగా ఓ రేంజ్ లో దూసుకు పోయాడు.
తెలుగు లో పోకిరి సినిమాలో చేసిన పాత్రకు గాను మంచి గుర్తింపు దక్కింది. విలన్ గానే కాకుండా విలక్షణ నటుడిగా ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ఇతర భాషల్లో ఆశీష్ విద్యార్థి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. అయితే ఈ మధ్య కాలంలో ఆఫర్లు తగ్గాయి.
ఆ మధ్య సినిమాలతో కంటే కూడా ఎక్కువగా తన వ్యక్తిగత విషయాల వల్ల వార్తల్లో నిలిచిన విషయం తెల్సిందే. నటుడిగా ఆశీష్ విద్యార్థిని ప్రేక్షకులు మెల్ల మెల్లగా మరిచి పోతున్నారు. ఫిల్మ్ మేకర్స్ కూడా పట్టించుకోవడం లేదు. అలాంటి సమయంలో నేను బతికే ఉన్నాను.. నాకు ఆఫర్లు ఇవ్వండి అన్నట్లు వ్యాఖ్యలు చేశాడు.
తాజాగా ఆశీష్ విద్యార్థి ఆ వ్యాఖ్యలపై స్పందించాడు. తనకు రెగ్యులర్ గా విలన్ పాత్రలనే ఎక్కువగా ఆఫర్ చేస్తున్నారు. అందుకే నాకు మంచి పాత్రలు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో బతికే ఉన్నాను క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు ఇవ్వాలని కోరినట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తాను రెండు మూడు సినిమాల్లో నటిస్తున్నట్లు పేర్కొన్నాడు.