టైలర్ కన్హయ్య లాల్ ఘటన దేశ వ్యాప్తంగా ఎంత సంచలనమైందో తెలిసిందే. పట్టపగలు ఇద్దరు వ్యక్తులు కన్హాయ్య లాల్ తల నరికి హతమార్చిన ఉదంతో దేశం మొత్తం ఒక్కసారిగా అట్టుడికిపోయింది. ఆ ఇద్దర్నీ పబ్లిక్ గానే ఉరి తీయాలని..ఎన్ కౌంటర్ చేయాలని భారతీయులంతా నినందించారు. ఇలాంటి వారిని ప్రభుత్వాలు సాధారణ శిక్షతో ఊపేక్షించకూడదని..మళ్లీ ఇలాంటి మత ఘటనలు చోటు చేసుకోండా ఒణికి పుట్టేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. దీంతో రాజాస్థాన్ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులోకి తెచ్చారు.
తాజాగా ఈ ఘటనపై ఏడాది తర్వాత సినిమా రూపొందుతుంది. `ఎ టైలర్ మర్డర్ స్టోరీ` అనే టైటిల్ తో భరత్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జానీ పైర్ ఫాక్స్ ప్రొడక్షన్ హౌస్ ఈ చిత్రాన్ని 40 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఈ సినిమాలో రా ఏజెంట్ పాత్ర కోసం సీమా హైదర్ ని లైన్ లోకి తెస్తున్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా సినిమా ప్రారంభించి రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.
మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన కారణంగా కన్హయ్య లాల్‌ని హతమార్చారు. రాజస్థాన్ ఉదయ్‌పుర్ మాల్దాస్‌లో ఈ ఘటన జరిగింది. ఉగ్ర సంస్థ ఐసిస్ ముష్కరులను తలపించేలా టైలర్ గొంతు కోసి క్రూరంగా హత్య చేశారు దుండగులు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
భాజపా సస్పెండ్ చేసిన నుపుర్ శర్మ వ్యాఖ్యలను సమర్థించినందుకే హత్య చేశామని హంతకులు ఓ వీడియో కూడా పోస్టు చేశారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఇలానే చేస్తామని హెచ్చరించారు. ఇలా వరుస పోస్టులతో దుండగలు దేశంలో మతాల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసారు. ప్రస్తుతం వారంతా పోలీసుల అదుపులో ఉన్నారు. కేసును ఉన్నత స్థాయి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.