నార్త్ - సౌత్ హీరోల‌తో అట్లీ మ‌రో లెవ‌ల్లో

ఆ త‌ర్వాత కండ‌ల హీరో స‌ల్మాన్ ఖాన్‌తో ప్రాజెక్టుకి క‌మిట‌య్యాడు అట్లీ.

Update: 2024-12-18 16:30 GMT

కింగ్ ఖాన్ షారూఖ్ న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం 'జవాన్'తో అట్లీ బాలీవుడ్‌లో అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. ఆరంగేట్రమే అత‌డు గ్రాండ్ సక్సెస్ సాధించాడు. జ‌వాన్ 1000 కోట్ల క్ల‌బ్ సినిమాగా రికార్డులు సృష్టించింది. ఆ త‌ర్వాత కండ‌ల హీరో స‌ల్మాన్ ఖాన్‌తో ప్రాజెక్టుకి క‌మిట‌య్యాడు అట్లీ. కానీ స‌ల్మాన్ ఖాన్ తో ఏ.ఆర్.మురుగ‌దాస్ ఓ చిత్రాన్ని(సికంద‌ర్) రూపొందిస్తున్నందున, అట్లీ ఈ గ్యాప్ లో వ‌రుణ్ ధావ‌న్ తో ప‌ని చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ బేబి జాన్. కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టించింది. ఈ నెల‌లోనే ఈ చిత్రం థియేట‌ర్ల‌లోకి విడుద‌ల కానుంది.

మ‌రోవైపు స‌ల్మాన్ ఖాన్ తో సినిమా కోసం అట్లీ సీరియ‌స్ గా ప‌ని చేస్తున్నాడు. ఈ సినిమాలో మునుపెన్న‌డూ భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లో చూడ‌ని ఓ కొత్త పాయింట్ ని ట‌చ్ చేస్తున్నాడ‌ని క‌థ‌నాలొస్తున్నాయి. స‌ల్మాన్ సినిమా కోసం అట్లీ చాలా శ్ర‌మిస్తున్నాడ‌ని బేబి జాన్ ప్ర‌మోష‌న‌ల్ ఇంట‌ర్వ్యూలో వ‌రుణ్‌ ధావ‌న్ కూడా వెల్ల‌డించాడు. అలాగే స‌ల్మాన్ - అట్లీ సినిమా(ఏ 6)లో ఓ ప్ర‌ముఖ సౌత్ స్టార్ కూడా న‌టిస్తార‌ని.. ఈ చిత్రం భారీ కాన్వాసుతో రూపొంద‌నుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

స‌ల్మాన్ తో పాటు విజ‌య్ సేతుప‌తితోను అట్లీ మ‌రో చిత్రానికి స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. బేబి జాన్ నిర్మాత మురాద్ ఖేతాని ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తారు. ఇది త‌మిళ చిత్రం. 2025 మొదటి త్రైమాసికంలో సెట్స్‌పైకి వెళుతుంది. అదే ఏడాది చివరి నాటికి విడుద‌ల‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇది అద్భుతమైన క‌థ‌తో రూపొంద‌నుంద‌ని, విజయ్ సేతుపతి స్థాయికి త‌గ్గ చిత్ర‌మ‌వుతుందని `పింక్ విల్లా` వెల్ల‌డించింది.

Tags:    

Similar News