బిగ్ బాస్ 8 : ఆ ఇద్దరు ఎలిమినేట్ అయినా ఫుల్ పేమెంట్ ఇస్తారా..?

మిగతా కంటెస్టెంట్స్ తో వీక్లీ పేమెంట్ లెక్క అగ్రిమెంట్ చేసుకున్న బిగ్ బాస్ టీం ఈ ఇద్దరికి మాత్రం సెపరేట్ అగ్రిమెంట్ ఏర్పాటు చేసుకున్నారట.

Update: 2024-10-26 05:46 GMT

బిగ్ బాస్ సీజన్ 8 లో ఎంటర్టైన్మెంట్ కాస్త తగ్గింది అనుకుంటున్న టైం లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని పంపించారు. ఐతే ఈసారి వైల్డ్ కార్డ్స్ గా ఇదివరకు సీజన్లలో ఉన్న వారినే పంపించారు. ఈ ప్లానింగ్ ఎవరిది అన్నది పక్కన పెడితే కాస్త కూస్తో వర్క్ అవుట్ అయినట్టుగానే ఉందని చెప్పొచ్చు. బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గా ఎనిమిది మంది కంటెస్టెంట్స్ వచ్చారు. వారిలో అవినాష్, జబర్దస్త్ రోహిణి కూడా ఉన్నారు. ఈ ఇద్దరు కామెడీ చేస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.

హౌస్ లో కూడా ఈ కాంబో ఎంటర్టైన్ చేస్తుంది. బిగ్ బాస్ సీజన్ 3 లో రోహిణి, సీజన్ 4 లో అవినాష్ వచ్చారు. మళ్లీ ఈ సీజన్ లో వారు వైల్డ్ కార్డ్స్ గా రీ ఎంట్రీ ఇచ్చారు. మిగతా కంటెస్టెంట్స్ తో వీక్లీ పేమెంట్ లెక్క అగ్రిమెంట్ చేసుకున్న బిగ్ బాస్ టీం ఈ ఇద్దరికి మాత్రం సెపరేట్ అగ్రిమెంట్ ఏర్పాటు చేసుకున్నారట. హౌస్ లోకి వీరిద్దరిని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే పంపించారని టాక్.

అందుకే బిగ్ బాస్ కూడా అవినాష్, రోహిణి లకు ప్రత్యేకంగా కామెడీ చేయండి.. కంటెస్టెంట్స్ ని ఎంటర్టైన్ చేయండి అని చెబుతున్నాడు. సో ఈ లెక్కన చూస్తే వీరు హౌస్ లో ఎన్ని వారాలు ఉన్నారో అంత పేమెంట్ అన్నట్టు కాకుండా ఎప్పుడు ఎలిమినేట్ అయినా వారు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం పేమెంట్ ఉంటుందని తెలుస్తుంది. వారు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారంగానే హౌస్ లో అవినాష్, రోహిణి ఇద్దరు కూడా అటు హౌస్ మెట్స్ తో పాటు ఆడియన్స్ ని నవ్విస్తున్నారు.

అవినాష్ రోహిణిలతో తేజ కూడా తన వంతు బాధ్యతగా కామెడీ చేస్తున్నాడు. సో బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ ఇద్దరిని వైల్డ్ కార్డ్ గా పంపించాలి అన్నది ఎవరి నిర్ణయమో కానీ అది మాత్రం బాగా వర్క్ అవుట్ అవుతుందని చెప్పొచ్చు. బిగ్ బాస్ లోకి వచ్చే టైం లో అవినాష్ జబర్దస్త్ కు గుడ్ బై చెప్పి రాగా రోహిణి సీజన్ 8 లో హౌస్ లోకి వచ్చే వారం ముందు వరకు జబర్దస్త్ చేస్తూ వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 8 లో అవినాష్ దూకుడు చూస్తుంటే టాప్ 5 లో పక్కా ఉండేలా ఉన్నాడు. రోహిణి కూడా ఇంకాస్త ట్రై చేస్తే ఆమె కూడా టాప్ 5 లో ఉండే ఛాన్స్ ఉంది.

Tags:    

Similar News