నల్లని చీరలో ఆయేషా గ్లామర్ ట్రీట్

సాధారణగా గ్లామర్ పోజులతో ఫోటోలు షేర్ చేసే తారలకు విరుద్ధంగా, ఆయేషా చీరలో సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ లో ఫ్యాన్స్ ను కట్టిపడేసింది.

Update: 2024-09-11 05:42 GMT

టాలీవుడ్ లో కొత్త తరం తారగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న ఆయేషా ఖాన్, తన అందం, అభినయం, మరియు గ్లామర్ ప్రెజెన్స్ తో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. బాలీవుడ్ లో మొదటగా అడుగు పెట్టినప్పటికీ, తెలుగులో చేసిన సినిమాల వల్ల క్రేజ్ మరింత పెరిగింది. మొదట్లో చేసిన కొన్ని సినిమాలు పెద్దగా వర్కౌట్ కాకపోయినా, ఆయేషా సోషల్ మీడియా ద్వారా తన గుర్తింపుని పెంచుకుంటూ ముందుకు సాగింది.

 

ప్రస్తుతం ఆమె ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో యాక్టివ్ గా ఉండి, తన లేటెస్ట్ ఫోటోషూట్లతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా, ఆమె ఇటీవల చీరలో చేసిన ఫోటోషూట్ ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచింది. సాధారణగా గ్లామర్ పోజులతో ఫోటోలు షేర్ చేసే తారలకు విరుద్ధంగా, ఆయేషా చీరలో సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ లో ఫ్యాన్స్ ను కట్టిపడేసింది.

 

నల్లని చీరలో ఆమె ఇచ్చిన సాఫ్ట్ లుక్స్, సింపుల్ హెయిర్ స్టైల్ నెటిజన్లను ఆకట్టుకోవడంతో పాటు, ఆమెను ఒక ట్రెండింగ్ సెలబ్రిటీగా నిలబెట్టాయి. అభిమానులను అలరించడమే కాకుండా, సినిమాల్లో తనకు తగ్గ పాత్రలు దొరకడం ద్వారా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును పొందింది.

 

గ్లామర్ మాత్రమే కాదు, తన సహజమైన నటనతో కూడా ఆమె ఆకట్టుకుంటోంది. టాలీవుడ్ లో ప్రత్యేక ఫ్యాన్ బేస్ సృష్టించుకున్న ఆమె, రాబోయే కాలంలో మరిన్ని అవకాశాలు దక్కించుకుంటుందనే అంచనాలు వేస్తున్నారు. సినిమాల్లో ప్రాధాన్యత కలిగిన పాత్రలు కాకపోయినా, ప్రత్యేక సాంగ్స్ మరియు సైడ్ రోల్స్ లో నటిస్తూ ఆమె తన ప్రతిభను నిరూపించుకుంది.

 

బాలీవుడ్ బిగ్ బాస్ సీజన్-17లో పాల్గొని మరింత ప్రజాదరణ పొందిన ఆయేషా, అక్కడ కూడా తన ప్రత్యేకతను చాటుకుంది. ప్రస్తుతం కొన్ని ప్రాజెక్ట్‌లలో బిజీ అయిన ఆమె, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్ హీరోలతో కూడా నటిస్తోంది. అలాగే లిస్టులో వెబ్ సీరీస్ కూడా ఉన్నట్లు సమాచారం. మరి రాబోయే రోజుల్లో అమ్మడు ఇంకా ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News