కోల్‌క‌త హ‌త్యాచారంపై క‌దిలించిన సినీహీరో క‌విత‌

ఇప్పుడు ఈ ఘ‌ట‌న‌పై బాలీవుడ్ యువ‌న‌టుడు ఆయుష్మాన్ ఖురానా త‌న‌దైన శైలిలో స్పందించాడు. అత‌డు రాసిన ఓ క‌విత హృద‌యాల‌ను క‌దిలిస్తోంది.

Update: 2024-08-15 10:28 GMT

ప్ర‌స్తుతం భార‌త‌దేశ వ్యాప్తంగా కోల్ క‌తా హ‌త్యాచార ఘ‌ట‌న చ‌ర్చ‌గా మారింది. ఏ న‌లుగురు క‌లిసినా దీని గురించి చ‌ర్చించుకుంటున్నారు. సెల‌బ్రిటీలు ఈ ఘ‌ట‌న‌ను తీవ్రంగా ఖండిస్తూ సోష‌ల్ మీడియాల్లో పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు ఈ ఘ‌ట‌న‌పై బాలీవుడ్ యువ‌న‌టుడు ఆయుష్మాన్ ఖురానా త‌న‌దైన శైలిలో స్పందించాడు. అత‌డు రాసిన ఓ క‌విత హృద‌యాల‌ను క‌దిలిస్తోంది.

కోల్‌కతా రే*-మర్డర్ కేసు గురించి తాజాగా ఇన్‌స్టా వీడియో ద్వారా ఆయుష్మాన్ ప్రస్తావించారు. ఈ క్లిప్‌లో హ‌త్యాచారానికి గురైన బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు. కాష్ మైం భీ లడ్కా హోతీ (నేను అబ్బాయిని కావాలనుకుంటున్నాను) అనే పేరుతో స్వీయ-రచన కవితను అత‌డు చదివాడు. ఈ కవిత సోషల్ మీడియాల్లో బాగా ప్రతిధ్వనించింది.

ఈ క‌విత‌పై నెటిజ‌నుల స్పంద‌న‌లు అనూహ్యంగా ఉన్నాయి. ''నేను నిజాయితీగా పదాలను వెతక‌లేక‌పోయాను. మీరు ప్రతి లైన్‌లో భావోద్వేగాలను అల్లిన విధానం నిజంగా విశేషమైనది. ఇది నా హృదయాన్ని లోతుగా తాకింది'' అని ఒక నెటిజ‌న్ వ్యాఖ్య‌ను జోడించారు. ఈ క్రూరమైన నేరానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ధన్యవాదాలు అని మ‌రొక నెటిజ‌న్ అన్నారు. తనలాంటి మరింత మంది వ్యక్తులు న్యాయం కోసం వాదించాల్సిన అవసరం ఉంద‌ని ఒక నెటిజ‌న్ అన్నారు.

కోల్ క‌త‌లోని ఆర్.జి క‌ర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో దేశాన్ని కదిలించిన భయానక సంఘటన జరిగింది, అక్కడ రెండవ సంవత్సరం మెడిసిన్ చదువుతున్న 31 ఏళ్ల మహిళా PGT డాక్టర్ దారుణంగా హ‌త్య‌కు గురైంది. హ‌త్య‌కు ముందు త‌నను దుండ‌గులు అత్యాచారం చేసారు.. ఆమె పాక్షిక నగ్న శరీరం ఆసుపత్రి సెమినార్ హాల్‌లో ల‌భ్య‌మైంది. శ‌రీరంపై అనేక గాయాలు గుర్తులు ఉన్నాయి. ప్రాథమిక శవపరీక్ష నివేదిక ఆమె మరణానికి ముందు లైంగిక వేధింపులకు గురైంద‌ని వెల్ల‌డించింది. ఆమె ఆసుపత్రి ఆవరణలోనే అత్యాచారం చేసి చంపార‌ని ఆమె తండ్రి ఆరోపించాడు. పరిస్థితి తీవ్రతకు స్పందించిన కలకత్తా హైకోర్టు దర్యాప్తును సీబీఐకు బదిలీ చేయాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా ఆరోగ్య సంరక్షణ సేవలపై ప్రభావం చూపుతూ దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు, ట్రైనీలు, వైద్య విద్యార్థులు మంగళవారం సమ్మెలు నిరసనలు చేపట్టారు. బాలీవుడ్ ప్రముఖులు కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తమ స్వరం పెంచారు. దర్యాప్తులో సీబీఐ ప్రమేయం కోసం కంగనా వాదించగా, ఆలియా భట్ బాధితురాలి తరపున న్యాయం కోసం పిలుపునిస్తూ ఒక పోస్ట్‌ను పంచుకున్నారు.

Tags:    

Similar News