బాబాయి అబ్బాయి అరిపించారు కదా!
అయితే ఈసారి మాత్రం ఇండియన్ ఓటీటీ ప్రేక్షకులు వెబ్ సిరీస్ కు బ్రహ్మరథం పట్టారు.
ఇండియాలో ఓటీటీ ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రముఖ ఓటీటీలన్నీ కూడా సినిమాలతో పాటు భారీ బడ్జెట్ తో నిర్మించిన వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ చేస్తున్న విషయం తెల్సిందే. అయితే సినిమాలతో పోల్చితే వెబ్ సిరీస్ లకు ఓటీటీ లో కాస్త ఆధరణ తక్కువ ఉంటుంది అనేది గతంలో మాట. అయితే ఈసారి మాత్రం ఇండియన్ ఓటీటీ ప్రేక్షకులు వెబ్ సిరీస్ కు బ్రహ్మరథం పట్టారు.
నెట్ ఫ్లిక్స్ 2023 లో అత్యధికంగా వ్యూస్ మరియు వీక్షణలు దక్కించుకున్న తమ సినిమాలు, సిరీస్ ల జాబితా విడుదల చేయడం జరిగింది. ఇండియన్ సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు ఎన్నో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యాయి. కానీ టాప్ 100 లో ఒక్క ఇండియన్ వెబ్ సిరీస్ లేదా సినిమా కూడా చోటు దక్కించుకోలేదు.
మన తెలుగు బాబాయి, అబ్బాయి వెంకటేష్, రానా నటించిన 'రానా నాయుడు' వెబ్ సిరీస్ 336వ స్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వీక్షణలు సొంతం చేసుకున్న వెబ్ సిరీస్, సినిమాల జాబితాలో రానా నాయుడు 336వ స్థానం దక్కించుకోవడం గొప్ప విషయం అన్నట్లుగా నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
హిందీ సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు నటించిన, రూపొందించిన వెబ్ సిరీస్ లు, సినిమాలు ఉండగా మన రానా నాయుడు మాత్రమే టాప్ 400 లో చోటు దక్కించుకోవడం ఆశ్చర్యకర విషయం అనడంలో సందేహం లేదు. రానా నాయుడు వెబ్ సిరీస్ లోని ప్రతి ఎపిసోడ్ కి మంచి ఆధరణ లభించింది.
తెలుగు ప్రేక్షకుల కంటే కూడా ఎక్కువగా ఉత్తరాది ప్రేక్షకులు రానా నాయుడు వెబ్ సిరీస్ ను ఆధరించారు. సుపర్ణ వర్మ మరియు కరణ్ అన్హుమాన్ లు ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. నెట్ ఫ్లిక్స్ గ్లోబల్ లిస్ట్ లో రానా నాయుడు చోటు దక్కించుకున్న నేపథ్యం లో మేకర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.