బేబీ కి నాన్ థీయాట్రికల్ తో ఎంత వచ్చిందంటే?

చిన్న సినిమా అయిన 10 కోట్ల వరకు ఈ మూవీకి ఖర్చు

Update: 2023-07-15 06:56 GMT

సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య విరాజ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం బేబీ. ఈ సినిమా జులై 14న రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. డీసెంట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ మౌత్ టాక్ తో జనాల్లోకి వెళ్తుంది. ఈ వీకెండ్ కచ్చితంగా యూత్ ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చే అవకాశం ఉంది.

ఎస్కెఎన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫెయిల్యూర్ లవ్ స్టొరీతో సాయి రాజేష్ ఈ చిత్రాన్ని ఫీల్ గుడ్ ఎమోషనల్ కంటెంట్ తో ప్రెజెంట్ చేశారు. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ కి రిలేట్ చేసే విధంగా ప్రతి ఒక్కరు తమని తాము కథలో భాగంగా చూసుకునే విధంగా ఆవిష్కరించారు. ఈ కారణంగానే మూవీ ప్రేక్షకులకి భాగా కనెక్ట్ అయ్యింది.

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన నాన్ థీయాట్రికల్ రైట్స్ అమ్ముడైపోయినట్లు తెలుస్తోంది. శాటిలైట్ డిజిటల్ రైట్స్ ద్వారా ఏకంగా 7.5 కోట్ల వచ్చాయంట.

చిన్న సినిమా అయిన 10 కోట్ల వరకు ఈ మూవీకి ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ నాన్ థీయాట్రికల్ రైట్స్ ద్వారా 75 శాతం బడ్జెట్ నిర్మాతకి వచ్చేసింది. దీంతో సినిమాని నైజాం ఉత్తరంద్రా సొంతంగానే రిలీజ్ చేసుకున్నారు.

మిగిలిన ప్రాంతాలకి సంబందించిన రైట్స్ ద్వారా నిర్మాతకి పెట్టిన పెట్టుబడి మొత్తం వెనక్కి వచ్చేసినట్లే అని చెప్పాలి. బ్రేక్ ఎవెన్ టార్గెట్ కూడా తక్కువగానే ఉండటంతో మొదటి మూడు రోజుల్లోనే అందుకునే అవకాశం కనిపిస్తోంది. శని ఆదివారాలలో కలెక్షన్స్ మరింత పెరుగుతాయని భావిస్తున్నారు.

ఇక ఈ మూవీ ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన వైష్ణవి చైతన్య పెర్ఫార్మెన్స్ కి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా నటిగా కెరియర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీకి బేబీ మూవీ హీరోయిన్ గా ఆమె ఇమేజ్ ని పెంచుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి అరకు సిల్వర్ స్క్రీన్ కి చిన్న చిన్న పాత్రలకి పరిమితం అయిన వైష్ణవికి బేబీ సాలిడ్ బ్రేక్ ఇచ్చిందని చెప్పొచ్చు.

Tags:    

Similar News