తొందరపాటా.. ఏమరపాటా.. బాలాదిత్యా..?

ఈమధ్య సినీ పరిశ్రమ ప్రభుత్వాల మధ్య కొద్దిపాటి దూరం ఏర్పడినట్టు తెలుస్తుండగా దాన్ని దగ్గర చేసే ప్రయత్నాలు ముమ్మరంగానే జరుగుతున్నాయి.

Update: 2025-01-06 09:10 GMT

ఈమధ్య సినీ పరిశ్రమ ప్రభుత్వాల మధ్య కొద్దిపాటి దూరం ఏర్పడినట్టు తెలుస్తుండగా దాన్ని దగ్గర చేసే ప్రయత్నాలు ముమ్మరంగానే జరుగుతున్నాయి. సంధ్య థియేటర్ ఘటనపై తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పుష్ప 2 ఈవెంట్ లో తన పేరు చెప్పలేదనే కక్ష తోనే ఇలా చేశాడని చాలా మంది అనుకున్నారు. సీఎం పేరు మర్చిపోవడం తప్పే కానీ మరీ పేరు మర్చిపోయినంత మాత్రానా సీఎం స్థాయి వ్యక్తి ఇలా పగ ప్రతీకారం తీర్చుకునే ఛాన్స్ ఉండదు. ఐతే అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోకుండా ఉన్నా ఆయన ఈ ఘటనపై ఇలానే రియాక్ట్ అయ్యి ఉండేవారు.

ముఖ్యంగా సీఎం పేరు మర్చిపోవడం ఆయనకేమో కానీ ప్రతిపక్షాల నుంచి వస్తున్న హేళన ని వాళ్లు భరించలేకపోతున్నారు. ఇదిలాఉంటే సీఎం రేవంత్ రెడ్డి పేరుని ఒక ప్రెస్టీజియస్ ఈవెంట్ లో వేదిక మీద మాట్లాడుతూ మర్చిపోయాడు మరో హీరో. సీరియల్స్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన బాలాదిత్య లేటెస్ట్ గా హెచ్.ఐ.సీ.సీ లో జరుగుతున్న ప్రపంచ తెలుగు సభల్లో బాలాదిత్య యాంకర్ గా వ్యాహరించాడు.

ఐతే ఆ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి కూడా గెస్ట్ గా వచ్చారు. ఈ క్రమంలో వ్యాఖ్యాతగా చేస్తున్న బాలాదిత్య మన ప్రియతమ నాయకులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారికి స్వాగతమని అన్నారు. సీఎం కిరణ్ కుమార్ అనగానే అక్కడ ఉన్న వారంతా కూడా కేకలు వేశారు. ఐతే వెంటనే తన తప్పు తెలుసుకున్న బాలాదిత్య క్షమించాలి అంటూ మన ప్రియతమ నాయకులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి స్వాగతమని అన్నారు.

సీఎం పేరు అది కూడా సినిమా వాళ్లు మళ్లీ మళ్లీ మర్చిపోవడం లాంటివి సీఎం రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ ని అసంతృప్తి పరుస్తున్నాయి. వేదిక జరిగే టైం లో చాలా అలర్ట్ గా ఉండాలి. అలా కాకుండా టెన్షన్ లో ఏదో ఒకటి మాట్లాడేస్తే ట్రోల్ మెటీరియల్ అవుతారు. ఐతే రేవంత్ రెడ్డి విషయంలోనే రెండు సార్లు ఇలా జరగడంపై ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. ఐతే విషయం పెద్దది అయ్యేలా ఉంది మరి బాలాదిత్య ఈ ఇష్యూపై పర్సనల్ గా స్పందిస్తాడా లేదా సోషల్ మీడియాలో అందరు చెబుతున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి బాలాదిత్య మీద కూడా యాక్షన్ కి దిగుతాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఐతే పొరపాటు ఏమరపాటు ఏదైనా సీఎం పేరు తప్పుగా పలకడం మాత్రం తప్పేనని అందరు అంటున్నారు.

Tags:    

Similar News