బాల‌య్య కామెంట్ కి అక్కినేని ఫ్యాన్స్ రాక్!

గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూ స‌మ‌యంలో న‌ట‌సింహ బాల‌కృష్ణ అక్కినేని ఫ్యామిలీని ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

Update: 2024-09-20 09:22 GMT

గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూ స‌మ‌యంలో న‌ట‌సింహ బాల‌కృష్ణ అక్కినేని ఫ్యామిలీని ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. `అక్కినేని...తొక్కినేని` అంటూ అప్ప‌ట్లో బాల‌య్య చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. అంత‌కు ముందు నుంచే ఆ రెండు కుటుంబాల మ‌ధ్య స‌రైన స‌ఖ్య‌త లేద‌నే ప్ర‌చారం ఉంది. బాల‌య్య వ్యాఖ్య‌ల‌తో వాటికి మ‌రింత ఆజ్యం పోసిన‌ట్లు అయింది.

ఏనాడు బాల‌య్య ఈవెంట్ల‌కు.. .వాళ్లింట పంక్ష‌న్ల‌కు అక్కినేని ఫ్యామిలీ స‌భ్యులెవ‌రు వెళ్లింది లేదు. అక్కినేని ఫ్యామిలీ ఇంట వేడుక‌ల‌కు బాల‌య్య వెళ్లింది లేదు. ఈ మ‌ధ్య‌నే బాల‌య్య పేరిట చిత్ర ప‌రిశ్ర‌మ స్వ‌ర్ణోత్స వాలు నిర్వ‌హించ‌గా వాటిని కింగ్ నాగార్జున స్కిప్ కొట్టిన సంగ‌తి తెలిసిందే. చిరంజీవి, వెంక‌టేష్ లాంటి త‌మ త‌రం వారు హాజ‌రైనా నాగార్జున మాత్రం హాజ‌ర‌వ్వ‌లేదు.

ఈ నేప‌థ్యంలో తాజాగా నేడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు శ‌త జ‌యంతి సంద‌ర్భంగా బాల‌య్య ఆస‌క్తిక పోస్ట్ పెట్టారు. `తెలుగు సినిమా చ‌రిత్ర‌లో సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించ‌బ‌డిన అక్కినేని నాగేశ్వ‌ర‌రావు గారి శ‌త జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న్ని స్మ‌రించుకోవ‌డం గ‌ర్వ‌కార‌ణం. మ‌న హృద‌యాల్లో చిర‌స్థాయిగా నిలిచిన పాత్ర‌లు, తెలుగు సినిమాకు ఆయ‌న చేసిన అమూల్య‌మైన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం.

ఆయ‌న కృషి, కీర్తి, స్పూర్తి ప్ర‌తీ న‌టుడికి మార్గ‌ద‌ర్శ‌కం. ఆయ‌న సేవ‌ల‌కు మ‌నంద‌రం శిర‌స్సు వంచి కృత‌జ్ఞ‌త‌లు చెబుదాం. నాట‌క రంగం నుంచి చిత్ర రంగం వ‌ర‌కూ ఆయ‌న చేసిన ప్ర‌యాణం ప్ర‌తీ ఒక్క‌రికి ప్రేర‌ణ‌. ఈరోజు ఆయ‌న‌కు అంద‌రం నివాళులు అర్పిస్తూ ఆయ‌న న‌ట‌న‌, సేవ‌, కృషి, ప‌ట్టుద‌ల‌తో సాధిం చిన విజ‌యాల‌ను స్మ‌రించుకుందాం` అన్నారు. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ వైర‌ల్ గా మారింది. గ‌తంలో ఏనాడు బాల‌య్య ఇలా ఏఎన్నార్ పై స్పందించింది లేదు.

Tags:    

Similar News