'అఖండ-2' లో మాజీపై భారీ డైలాగులా?
నటసింహ బాలకృష్ణ 110వ చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వంలో లాక్ చేసిన సంగతి తెలిసిందే
నటసింహ బాలకృష్ణ 110వ చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వంలో లాక్ చేసిన సంగతి తెలిసిందే. 'అఖండ'కి సీక్వెల్ గా 'అఖండ-2'ని పట్టాలెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియాలోనే ప్లాన్ చేస్తున్నారు. హిందుత్వ కాన్సెప్ట్ తో తెరకెక్కిన 'అఖండ' నార్త్ కి కూడా బాగా కనెక్ట్ అవ్వడంతో రెండవ భాగాన్ని ఈ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి స్టోరీ పనుల్లో బిజీగా ఉన్నారు. బాలయ్య 109వ చిత్రం ముగించుకుని బయటకు రాగానే స్టోరీ సిద్దం చేసి పెట్టాలి.
వెంటనే పట్టాలెక్కించాలి. ఈ నేపథ్యంలో ఏమాత్రం సమయం వృద్ధా చేయకుండా బోయపాటి ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. తాజాగా సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది. సినిమాలో ఏపీ రాజకీయాన్ని టచ్ చేస్తున్నారుట. బ్యాక్ డ్రాప్ స్టోరీ అంతా ఏపీ పాలిటిక్స్ మీదనే నడుస్తుందని..అండర్ కరెంట్ గా హిందుత్వం బేస్ అయి ఉంటుందిట. దీనిలో భాగంగా కథలో రాజకీయ విషయాలను - డైలాగ్ లను జోడీస్తున్నారుట. అందుతోన్న సమాచారం ప్రకారం ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ డైలాగులు కొన్ని డైలాగులు రాయించాలని బోయపాటి ఫిక్స్ అయ్యారుట.
వాటిని బాలయ్య నోట అంతే పవర్ పుల్ గా చెప్పించనున్నారుట. గత ప్రభుత్వ పరిపాలనను విమర్శిస్తూ కొన్ని పాత్రలు సైతం తెరపై కనిపించనున్నాయట. బేసిక్ గానే బాలయ్య-బోయపాటి అంటే సినిమాలో రాజకీయ నేపథ్యం కనిపిస్తుంది. వైకాపా పాలనని రాక్షస పాలనగా విమర్శించిన నేపథ్యంలో టీడీపీ పార్టీ సినిమాలో వైకాపాని గట్టిగానే టార్గెట్ చేసే అవకాశం కనిపిస్తుంది. పైగా జగన్ ప్రతిపక్ష హోదా కూడా లేని నేపథ్యంలో ఎటాకింగ్ గట్టిగా చేసే అవకాశం ఉంది.
ఇప్పటికే కూటమి అధికారంలోకి రావడంతో ఏపీలో ప్రత్యర్ధులపై దాడులు జరుగుతోన్న వైనం కనిపిస్తోన్న నేపథ్యంలో 'అఖండ-2' మరింత ఆసక్తికరంగా మారుతుంది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రగ్యాజైశ్వాల్ ని రిపీట్ చేస్తున్నారుట. 'అఖండ'లో అమ్మడు నటించిన సంగతి తెలిసిందే. అందులో బాలయ్య-ప్రగ్యా మధ్య కెమిస్ట్రీ కూబా వర్కౌట్ అయింది. అందుకే మరోసారి బోయపాటి రిపీట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.