బాబీ, బాలయ్య సినిమాకి గండం?
బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన భగవంత్ కేసరి దసరాకి ప్రేక్షకుల ముందుకి రానుంది.
బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన భగవంత్ కేసరి దసరాకి ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దీని తర్వాత బాబీ దర్శకత్వంలో సినిమాని బాలయ్య సెట్స్ పైకి తీసుకొని వెళ్ళాల్సి ఉంది. ఈ సినిమా శరవేగంగా పూర్తి చేసి ఎన్నికల ముందు రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. దానికి తగ్గట్లుగానే బాబీ కూడా సిద్ధమయ్యారు.
క్యాస్టింగ్ సెలక్షన్ కూడా మేగ్జిమమ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. అన్ని అనుకూలంగా జరిగితే ఈ నెల 29న మూవీ ప్రారంభించాల్సి ఉంది. దీనికి ముహూర్తం కూడా పెట్టేశారు. అయితే ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. టీడీపీ అధినేత చంద్రబాబుని అరెస్ట్ చేసి సెంట్రల్ జైల్లో పెట్టారు. తెలుగుదేశం పార్టీకి ఇది పెద్ద దెబ్బ. త్వరలో లోకేష్ ని అరెస్ట్ చేస్తారనే ప్రచారం నడుస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో బాలయ్య ప్రస్తుతం ఫోకస్ అంతా రాజకీయాల మీదనే ఉంది. చంద్రబాబుని బయటకి తీసుకురావడంపై పూర్తిగా దృష్టి పెట్టి ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ క్యాడర్ నిరాశకి గురి కాకుండా భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. బాలయ్య దీనిని తన భుజాలపై వేసుకున్నారు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా పార్టీ వ్యవహారాలలో తలమునకలై ఉన్నారు.
ఎన్నికల వేడి కూడా ఏపీలో ఇప్పటికే మొదలైంది. ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల మధ్యలో బాబీ సినిమా ఉంటుందా అనే అనుమానం కలుగుతోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి బాలయ్య స్ట్రాంగ్ పిల్లర్ గా ఉన్న నేపథ్యంలో ఇప్పట్లో సినిమా ఓపెనింగ్ పెట్టుకోకపోవచ్చనే మాట వినిపిస్తోంది. ఒక వేళ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
ఈ సినిమా ఉంటుందా, ఉండదా అనేదానిపై ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదు. ప్రస్తుతం ఏపీలో ఉన్న ఉన్న రాజకీయ పరిణామాలు మారితే అప్పుడు సినిమాపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అంత వరకు బాలయ్య అభిమానులు అందరూ ఈ సినిమా అప్డేట్ కోసం ఎదురుచూదాల్సిందే.