2025 సమ్మర్ కి బాలయ్య ఫిక్స్..!
అయితే ఈ సినిమా పూర్తి చేసి బాలయ్య తన నెక్స్ట్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు.
సీనియర్ హీరోల్లో సూపర్ ఫాంలో ఉన్న నందమూరి బాలకృష్ణ లాస్ట్ ఇయర్ రెండు సూపర్ హిట్ సినిమాలతో కెరీర్ మరింత జోష్ అందుకున్నాడు. ప్రస్తుతం కె.ఎస్ బాబీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న బాలకృష్ణ ఆ సినిమాతో మళ్లీ ఈ ఇయర్ దసరా బరిలో దిగాలని చూస్తున్నాడు. N.B.K 109 సినిమా రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ సినిమా పూర్తి చేసి బాలయ్య తన నెక్స్ట్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు.
బాలకృష్ణ 110వ సినిమా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఉండబోతుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ దసరా తర్వాత సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. అఖండ సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై నందమూరి ఫ్యాన్స్ కే కాదు సినీ ప్రేక్షకులకు అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. అఖండ 2 సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ ఉంటుందని.. నార్త్ ఆడియన్స్ ని కూడా మెప్పించేలా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది.
బోయపాటి శ్రీను బాలకృష్ణ ఈ కాంబినేషన్ అంటేనే హిట్ అన్నట్టే లెక్క. మరి ఈ కాంబోలో రాబోతున్న అఖండ 2 ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ సినిమాను అక్టోబర్ లో మొదలు పెట్టి ఆరు నెలలు షూట్ చేసి నెక్స్ట్ ఇయర్ సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. 2025 సంక్రాంతికి ఆల్రెడీ భారీ సినిమాల రిలీజ్ లు ఉన్నాయి. ఈ ఇయర్ 109వ సినిమా వస్తే 2025 సంక్రాంతికి బాలకృష్ణ సినిమా వచ్చే ఛాన్స్ లేదు. సో నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి అఖండ 2 రిలీజ్ అయ్యేలా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.
అఖండ 2 కథ ఎలా ఉండబోతుంది.. బోయపాటి ఈసారి ఎలాంటి అటెంప్ట్ చేస్తున్నారు అన్నది ఫ్యాన్స్ లో ఎగ్జైట్ మెంట్ ఉంది. అయితే అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అఖండ 2 ని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. స్కంద ఫ్లాప్ అయినా కూడా బోయపాటి మీద ఉన్న నమ్మకంతో బాలయ్య అఖండ 2 ని చేస్తున్నాడు. తప్పకుండా బోయపాటి మరోసారి అతని మాస్ స్టామినా ఈ సినిమాతో ప్రూవ్ చేసుకోవాల్సిందే అని చెప్పొచ్చు. అఖండ 2 స్టార్ కాస్ట్ కూడా త్వరలో బయటకు రానుంది. మ్యూజిక్ డైరెక్టర్ గా మాత్రం థమన్ డౌట్ లేకుండా ఫిక్స్ అని చెప్పొచ్చు.