సీఎంతో న‌ట‌సింహ బాల‌కృష్ణ‌ భేటి

ప్ర‌స్తుతం అంతా ఏపీలో ఎన్నిక‌ల ఫ‌లితాల కోసం ఎదురు చూస్తోన్న నేప‌థ్యంలో వాటి గురించి ఇరువురి మ‌ధ్య చ‌ర్చ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.

Update: 2024-05-26 08:11 GMT

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డితో హిందుపురం ఎమ్మేల్యే, న‌ట‌సింహ బాల‌కృష్ణ మ‌ర్యాద‌పూర్వ‌కంగా నేడు భేటి అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఇరువురి మ‌ధ్య సినీ, రాజ‌కీయ అంశాలు ప్ర‌స్తావ‌న‌కి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం అంతా ఏపీలో ఎన్నిక‌ల ఫ‌లితాల కోసం ఎదురు చూస్తోన్న నేప‌థ్యంలో వాటి గురించి ఇరువురి మ‌ధ్య చ‌ర్చ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఏపీలో ఏపార్టీ గెలుస్తుంది...ఎవ‌రికి ఎలాంటి మెజార్టీ రాబోతుంది వంటి విష‌యాల‌పై చ‌ర్చించుకున్న‌ట్లు ప్ర‌చారం సాగుతుంది.

అలాగే తెలంగాణ లోక్ స‌భ స్థానాల‌కు సంబంధించి కూడా ఇరువురి మ‌ధ్య చ‌ర్చ జ‌రిగిన‌ట్లు స‌మాచారం. జూన్ 4న ఫ‌లితాల నేప‌థ్యంలో ఇద్ద‌రి భేటీ ఆస‌క్తిక‌రంగా మారింది. ఇక టాలీవుడ్ నుంచి సినీ ప్ర‌ముఖులు కొత్త సీఎంని క‌ల‌వ‌డం ఇప్ప‌టికే జ‌రిగింది. మెగాస్టార్ చిరంజీవి వ్య‌క్తిగ‌తంగా సీఎం రేవంత్ ని క‌లిసారు. ముఖ్య‌మంత్రి అయిన‌ స్వ‌యంగా తన ఇంటికి వెళ్లి అభినందించారు. ఈసంద‌ర్భంగా ఇద్ద‌రి మ‌ధ్య సినీ ప‌రిశ్ర‌మ‌కి సంబంధించిన ఆస‌క్తిర చ‌ర్చ జ‌రిగిన‌ట్లు ప్ర‌చారంలోకి వ‌చ్చింది.

ఇండ‌స్ట్రీ స‌మ‌స్య‌ల్ని చిరంజీవి సీఎం దృష్టికి తీసుకెళ్లిన‌ట్లు మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. అటుపై నాగార్జున దంప‌తులు కూడా రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. దీనికి సంబంధించిన ఫొటోలు వీడియో నెట్టింట వైరల్ అయ్యాయి. టాలీవుడ్‌లోని వివిధ శాఖలకు చెందిన పలువు ప్రముఖులు సీఎం ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. సీఎంను కలిసిన వారిలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిల్ రాజు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కెఎల్ దామోదర ప్రసాద్, కౌన్సిల్ సెక్రెటరీ వైవీఎస్ చౌదరి వంటి ప్రముఖులు ఉన్నారు.

వీరితో పాటు తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సునీల్ నారాయణ, సెక్రటరీ కె.అనుపమ రెడ్డి, ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్, సెక్రెటరీ టీఎస్ఎన్ దొర, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ పీవీ రవి కిషోర్, ట్రెజరర్ బాపినీడు, సుప్రియ వంటి వారంతా ఉన్నారు. క‌లిసిన వారంతా ఇండ‌స్ట్రీ స‌మ‌స్య‌ల్ని సీఎం దృష్టికి తీసుకెళ్లిన‌ట్ల తెలుస్తోంది. గ‌తంలో కేసీఆర్ అధికారంలో ఉన్న స‌మ‌యంలోనూ సినీ పెద్ద‌లు ఆయ‌న్ని ఎప్ప‌టిక‌ప్పుడు క‌లిసేవారు. ఇండ‌స్ట్రీకి సంబంధించిన స‌మ‌స్య‌లు ఆయ‌న దృష్టికి తీసుకెళ్ల‌డం జ‌రిగింది.

Tags:    

Similar News