మళ్లీ ఎన్నికల ముందే బాలయ్య రచ్చ!
బాబితో 109వ సినిమా చేస్తున్నారు. అది పూర్తికాగానో మరో ఇద్దరు స్టార్ డైరెక్టర్లను రంగంలోకి దించాలని ఇప్పటినుంచే ప్రణాళికలు వేస్తున్నారు.
2024 ఎన్నికల ముందు నటసింహ రచ్చ షురూ అయిందా? 2014 ఎన్నికల సమయాన్ని బాలయ్య మళ్లీ గుర్తు చేయబోతున్నారా? అంటే అవుననే తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య పుల్ స్వింగ్ లో దూసుకుపో తున్న సంగతి తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లతో ఊపు మీద ఉన్నాడు. `అఖండ`.. `వీరసింహారెడ్డి ..`భగవంత్ కేసరి`తో హ్యాట్రిక్ విజయాలు నమెదు చేసారు. డబుల్ హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య కమిట్ మెంట్లు కూడా అంతే బలంగా ఉన్నాయి.
బాబితో 109వ సినిమా చేస్తున్నారు. అది పూర్తికాగానో మరో ఇద్దరు స్టార్ డైరెక్టర్లను రంగంలోకి దించాలని ఇప్పటినుంచే ప్రణాళికలు వేస్తున్నారు. ఇలా బాలయ్య ఓ పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నాడు. అటు రాజకీ యాల్లో సైతం అంతే బిజీగా ఉంటున్నారు. ఇలా రెండు పడవల ప్రయాణం చేస్తూనే ఏపీ రాజకీయాల్లో మళ్లీ కలవరం పుట్టించడానికి రెడీ అవుతున్నారు ఆయన హీరోగా నటించిన `లెజెండ్` చిత్రాన్ని మార్చి 30న రిలీజ్ చేస్తున్నారు.
రెండు రాష్ట్రాల్లోనూ భారీ ఎత్తున రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈసినిమా మార్చి 28 తో రిలీజ్ అయి పదేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భం కలిసి రావడంతో పాటు..ఏపీలో ఎన్నికల వేడి ముందు ఇలాంటి చిత్రాన్ని అభిమానుల ముందుకు తీసుకొస్తే అదో వేడిలో పనిచేస్తుందని రిలీజ్ ఇలా ప్లాన్ చేసినట్లు కనిపిస్తుంది. సరిగ్గా 2014 ఎన్నికల ముందు ఈ చిత్రం రిలీజ్ అయి భారీ విజయం సాధించింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు.
ఆ సినిమా రిలీజ్ అవ్వడం..చంద్రబాబు సీఎం అవ్వడం...బాలయ్య ఎమ్మెల్యే అవ్వడం ఎంతో శుభ సూచికంగా ఆ సినిమాతో కనిపించింది. అందుకే మరోసారి 2024 ఎన్నికల్లోనూ లెజెండ్ ని మళ్లీ ఇలా అస్త్రంలా దించుతున్నారు. మరి ఈ సెంటిమెంట్ ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి. 2019 ఎన్నికల్లో బాలయ్య నటించిన `రూలర్` రిలీజ్ అయింది. ఆ సినిమా ప్లాప్ అయింది. టీడీపీ అధికారం కోల్పోయింది. అదే ఏడాది ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు కూడా రిలీజ్ అయింది. ఆ రెండు భాగాలు కూడా ఆశించిన ఫలితాలు సాధించని సంగతి తెలిసిందే.