బాలయ్యని ఇలా రౌండప్ చేసారా?
`అఖండ` విజయం తర్వాత నటసింహ బాలకృష్ణ రేంజ్ అంతకంతకు రెట్టింపు అయింది.
`అఖండ` విజయం తర్వాత నటసింహ బాలకృష్ణ రేంజ్ అంతకంతకు రెట్టింపు అయింది. ఆపై రిలీజ్ అయిన సినిమాలు వరుసగా విజయాలు సాధించడంతో డబుల్ హ్యాట్రిక్ పై కన్నేసాడు. ప్రస్తుతం బాబి దర్శకత్వంలో ఆయన 109వ సినిమా ఆన్ సెట్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇంత వరకూ బాబికి వైఫల్యమే లేదు. బాబి లాంటి మాస్ డైరెక్టర్ బాలయ్య ఊర మాస్ ఇమేజ్ తోడైతే ఎలా ఉంటుందో? అంచనాలు అభిమానులకు అందడం లేదు. బాలయ్య ఖాతాలో మరో హిట్ లాంఛనమేనని అంతా భావిస్తున్నారు.
ఆపై బాలయ్య తీసుకునే రెండు సినిమాల నిర్ణయం అన్నది అత్యంత కీలకమైన అంశం. ఆయన ఎంపిక చేసుకునే దర్శకులపై డబుల్ హ్యాట్రిక్ అన్నది సాధ్యసాధ్యాలు నిర్ణయించబడతాయి. అయితే ఇప్పటికే బాలయ్య రేస్ లో పలువురు స్టార్ డైరెక్టర్ల పేర్లు తెరపైకి వస్తున్నాయి. బోయపాటి శ్రీనుతో `అఖండ-2` దాదాపు కన్పమ్ అయింది. అది ఎప్పుడు పట్టాలెక్కుతుంది అన్నది తెలియదుగానీ ప్రాజెక్ట్ మాత్రం పక్కా అని తేలిపోయింది.
ఆయన కాకుండా హరీష్ శంకర్...ప్రశాంత్ వర్మ..అనీల్ రావిపూడి కూడా ఈ రేసులో కనిపిస్తున్నారు. ప్రశాంత్ వర్మతో సినిమా చేయాలని ఉందని బాలయ్య హనుమాన్ రిలీజ్ కి ముందే ఎంతో ఓపెన్ గానే చెప్పారు. అతడి ప్రతిభని తొలి సినిమాతోనే గుర్తించిన బాలయ్య ఆ నమ్మకంతోనే ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పుడదే నమ్మకంతో బాలయ్యని డైరెక్ట్ చేయడానికి ప్రశాంత్ వర్మ వెయిట్ చేస్తున్నాడు. ఇప్పటికే బాలయ్య కోసం కథ కూడా సిద్దమైంది.
అయితే అది బాలయ్య ఇమేజ్ స్టోరీనా? ప్రశాంత్ వర్మ క్రియేటివ్ గా చేస్తున్న కాన్సెప్ట్ నా ? అన్నది తెలియాలి. అలాగే హరీష్ శంకర్ కూడా బాలయ్య కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. ఛాన్స్ ఎప్పుడు ఇస్తాడా? వెయిట్ చేస్తున్నాడు. మరోవైపు హిట్ కాంబోని రిపీట్ చేయాలని బాలయ్య..అనీల్ రావిపూడితో మరోసినిమా చేయాలని అంతే ఉత్సాహంగా ఉన్నారు. ఇంకా బాలయ్య కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పేరు కూడా రేసులో వినిపిస్తుంది. సీనియర్ తరాన్ని పక్కనబెడితే టైర్ వన్ హీరోలంతా బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో బాలయ్య తో ముందుకెళ్తే బాగుంటుందని గురూజీ ప్లాన్ చేస్తున్నారు. మరి వీళ్లందర్నీ సింహం లైన్ లోకి తెస్తే గనుక మూడేళ్ల పాటు ఆయన డైరీ ఫుల్ అయినట్లే. 2027 వరకూ మరో డైరెక్టర్ కి డేట్లు ఇచ్చే పరిస్థితి ఉండదు.