బాలయ్యతో స్టార్ వారసుల ఫైట్

2025 సంక్రాంతికి బాలయ్య సినిమాతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న 'గేమ్ చేంజర్' కూడా రాబోతుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అనౌన్స్ చేసేసింది. ఈ రెండు చిత్రాలతో పాటు అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తోన్న 'తండేల్'

Update: 2024-10-16 17:45 GMT

దాదాపు నలభై ఏళ్లుగా తెలుగు సినిమా రంగంలో తనదైన ముద్రను వేసుకుంటూ బడా హీరోగా దూసుకుపోతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. దీనికితోడు ఈ మధ్య కాలంలో ఆయన వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో ముందుకు వెళ్తున్నారు. ఈ ఉత్సాహంతోనే ఆయన వరుసగా మరిన్ని ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. ఇలా ఇప్పుడు బాలయ్య తన 109వ సినిమాను చేస్తున్నారు.

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ఇప్పుడు టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని ఎంతో ఉన్నతంగా తీస్తున్నారు. అంతేకాదు, ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్‌ను సైతం చాలా వరకూ కంప్లీట్ చేసుకున్నారు.

 

నందమూరి బాలయ్య - బాబీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ విషయాన్ని ఇటీవలే చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. దీంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. అదే సమయంలో బాలయ్య సంక్రాంతి బరిలో దిగడంపై ఎన్నో రకాల చర్చలు కూడా తెరపైకి వస్తున్నాయి.

తెలుగు చిత్ర పరిశ్రమలో సంక్రాంతి సీజన్‌కు ప్రత్యేకత ఉంటుంది. అందుకే ఆ సీజన్‌లో తమ సినిమాలను విడుదల చేసేందుకు హీరోలు, దర్శక నిర్మాతలు ఉత్సాహం చూపుతుంటారు. ముఖ్యంగా పొంగల్ సీజన్‌లో బాలయ్య, చిరంజీవి, నాగార్జున మధ్య పోటీ ప్రత్యేకంగా నిలుస్తోంది. అయితే, ఈ సారి మాత్రం మెగాస్టార్, కింగ్ పోటీ నుంచి తప్పుకున్నారు. కానీ, తమ వారసులను రంగంలోకి దింపుతున్నారు.

2025 సంక్రాంతికి బాలయ్య సినిమాతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న 'గేమ్ చేంజర్' కూడా రాబోతుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అనౌన్స్ చేసేసింది. ఈ రెండు చిత్రాలతో పాటు అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తోన్న 'తండేల్' కూడా విడుదల కాబోతుందని తెలిసింది. దీనిపై ఈ రెండు రోజుల్లోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందనే టాక్ వినిపిస్తోంది.

మొత్తానికి సంక్రాంతి పోటీని రసవత్తరంగా మార్చేలా బాలయ్యలో స్టార్ హీరోల వారసులైన రామ్ చరణ్, నాగ చైతన్య పోటీ పడబోతున్నారు. ఇవి మాత్రమే కాదు.. విక్టరీ వెంకటేష్ నటిస్తోన్న 'సంక్రాంతికి వస్తున్నాం' కూడా ఇదే సీజన్‌లో విడుదల కానుంది. సంక్రాంతికి చాలా సమయం ఉన్న నేపథ్యంలో ఈ రిలీజ్ డేట్లలో ఏమైనా మార్పులు వస్తాయేమో చూడాలి.

Tags:    

Similar News