దమ్ము..ధైర్యం అన్ని నాన్న నుంచే!
నటసార్వభౌమ నందమూరి తారకరామారావు వారసుడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చిన నటసింహ బాలకృష్ణ కొన్నేళ్లగా తెలుగు ప్రేక్షకుల్ని తనదైన నటనతో అలరిస్తోన్న సంగతి తెలిసిందే.
నటసార్వభౌమ నందమూరి తారకరామారావు వారసుడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చిన నటసింహ బాలకృష్ణ కొన్నేళ్లగా తెలుగు ప్రేక్షకుల్ని తనదైన నటనతో అలరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో ఆయనకు ఆయనే పోటీ. ఆయనకు ఎవరు సాటి అన్న చందంగా జర్నీ సాగిపోతుంది. డైలాగ్ చెప్పాలన్నా..కత్తి పట్టి చెరబెట్టాలన్నా? బాలయ్య తర్వాత ఎవరైనా. ఈ రెండింటి విషయంలో బాలయ్యకి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది.
ఒకప్పుడు సీమ ఫ్యాక్షనిజంతో గొడ్డలి పట్టిన బాలయ్య ఇప్పుడదే గొడ్డలిని స్టైలిష్ గా పట్టి బాక్సాఫీస్ ని మోత మోగిస్తున్నారు. అందుకే బాలయ్య-బోయపాటి కాంబినేషన్ అంత పెద్ద సక్సెస్ అయింది. ఆ కాంబినేషన్ కి మహేష్ సైతం వీరాభిమాని అయ్యారు. ఇటీవలే రిలీజ్ అయిన భగవంత్ కేసరితో సరికొత్త బాలయ్యని అభిమానులు చూసారు. అందులో పాత్ర ఆయనకు వైవిథ్యమైన గుర్తింపును తీసుకొచ్చింది.
అయితే తన నటన పరంగా ఎలాంటి పాత్ర వెనుక అయినా తండ్రి తారకరామారావు ఉంటారని బాలయ్య మరోసారి ఉద్ఘాటించారు. వైవిథ్యమైన పాత్రలు చేసే దమ్ము..ధైర్యం..నమ్మాకం మా నాన్న నుంచే వచ్చిన వారసత్వం అని తనదైన శైలిలో చెప్పెకొచ్చారు. మూడు తరాలుగా ప్రేక్షకుల మన్నలను పొందుతున్నా నంటే? నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను. నాసినిమాలకి నా సినిమాలే పోటీ. ఇలాంటి పాత్రలు నాకు వస్తున్నాయంటే కారణం నేనొక నమ్మకమైతే.. నిర్మాతలు మరో నమ్మకం.
దర్శకులు నన్న మలిచే కోణం..రచయితలు నాతో పలికించే సంభాషణలు వీటన్నింటికి ఫలితమే విజయాల పరంపర. `అఖండ`..`వీరసింహారెడ్డి`..`భగవంత్ కేసరి` ఇవన్నీ నాకు సవాల్ విసిరిన సినిమాలే. ఓ మంచి సినిమా వచ్చినప్పుడు ఏం చేయడానికైనా నేను సిద్దం. భగవంత్ కేసరి అలాంటి సినిమా కాబట్టే చేసాను. ఇలాంటి సినిమాలు నానుంచి మరెన్నో వస్తాయి. అభిమానుల్ని అలరించడం కోసం దేనికైనా సిద్దం` అని అన్నారు.