ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన బాలయ్య... సర్వత్రా హర్షం!

ఈ క్రమంలో తాజాగా ఈ క్యాన్సర్ హాస్పటల్ చికిత్సలో దేశంలో రెండో స్థానంలో నిలిచింది.

Update: 2024-06-24 09:19 GMT

ఓ వైపు సినిమా హీరోగా, మరోవైపు హిందుపురం ఎమ్మెల్యేగా ఫుల్ బిజీగా ఉండే బాలయ్య... మరోపక్క బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. మరోపక్క ఇటీవల ఆహా ఓటీటీ కోసం యాంకర్ అవతారం కూడా ఎత్తిన బాలయ్య తనలోని మరో కోణాన్ని ప్రజలకు చూపించారు.

ఈ క్రమంలో తాజాగా ఈ క్యాన్సర్ హాస్పటల్ చికిత్సలో దేశంలో రెండో స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని ఇంగ్లిష్ పత్రిక సర్వేలో తేల్చిందని తెలుస్తుంది. ఈ హాస్పిటల్ లో బాలయ్య తక్కువ ఖర్చులతో పేద ప్రజలకు నాణ్యమైన చికిత్స అందిస్తున్నారు. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బాలకృష్ణ గుడ్ న్యూస్ చెప్పారు.

అవును... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ గుడ్ న్యూస్ చెప్పారు. ఇందులో భాగంగా... ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధికి చికిత్స అందించే ప్రముఖ బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిని ఆంధ్రప్రదేశ్ లోనూ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ ఆస్పత్రి నిర్మాణానికి గతంలోనే చంద్రబాబు స్థలం కేటాయించారని ఆయన వెల్లడించారు.

కాగా... శనివారం హైదరాబాద్ లోనే బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హ్యాస్పిటల్, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ 24వ వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడిన నందమూరి బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు.

దాతల సహాయ సహకారాలతోనే ఆసుపత్రి ఈ స్థాయికి చేరుకుందన్నారు. భవిష్యత్తులో బసవతారకం ఆస్పత్రి సేవలు మరింత విస్తరించాలని అన్నారు. ఈ క్రమంలోనే త్వరలో ఏపీలోనూ ఈ ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో... ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య ఇలానే ముందుకు పోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Tags:    

Similar News