హారర్ మిస్టరీలో బెల్లంకొండ శ్రీనివాస్
తాజాగా రామనవమి సందర్భంగా.. పోస్టర్ లాంచ్‌తోనే డెప్త్ ఉన్న ఘాడమైన కథాంశాన్ని తెరపై చూపుతామని అనుభూతిని కలిగించారు.
తన 10వ సినిమాతో బిజీగా ఉన్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ శ్రీరామ నవమి సందర్భంగా #BSS11 చిత్రాన్ని ప్రకటించారు. లోతైన భావోద్వేగాలతో కూడిన కమర్షియల్ చిత్రాలను రూపొందించడంలో పేరుగాంచిన డైనమిక్ నిర్మాత సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. కౌశిక్ ఈ సినిమాకి కథారచయిత. తాజాగా రామనవమి సందర్భంగా.. పోస్టర్ లాంచ్‌తోనే డెప్త్ ఉన్న ఘాడమైన కథాంశాన్ని తెరపై చూపుతామని అనుభూతిని కలిగించారు.
నిజంగా ఈ పోస్టర్ లో ఒక విషయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. శ్రీరాముడు విల్లంబులతో ఆకాశంలో ఒక రాక్షసుడిని లక్ష్యంగా చేసుకుని బాణం సంధిస్తున్నారు. పోస్టర్ లో షాడో తోలుబొమ్మలాట కనిపిస్తోంది. నిర్జనమైన అడవి, యాంటెన్నా టవర్ , హార్నెట్ కూడా పోస్టర్ లో చూడవచ్చు. శ్రీరామ నవమి సందర్భంగా ఇది సరైన పోస్టర్.
భగవంత్ కేసరి సంచలన విజయం తర్వాత, షైన్ స్క్రీన్స్ ఈ ఎలక్ట్రిఫైయింగ్ హారర్ మిస్టరీతో మరపురాని సినిమాటిక్ అనుభూతిని అందజేస్తున్నామని చెప్పకనే చెబుతోంది. ఈ చిత్రం మోడ్రన్ డే స్టోరీతో లైట్ వర్సెస్ డార్క్ కథను పునర్నిర్వచించటానికి ఉద్ధేశించినది. భయాన్ని ప్రేరేపించడం ద్వారా ఆశను కలిగించే థీమ్ ని ఎలివేట్ చేయనున్నారు. ఒరిజినల్ కథతో సాంకేతికంగా అద్భుతమైన విజువల్ ఫీస్ట్ గా ఉండే సినిమాని అందిస్తామని దర్శకనిర్మాతలు చెబుతున్నారు.
శ్రీమతి షైన్ స్క్రీన్స్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం. 8ని అర్చన సమర్పిస్తున్నారు. అత్యుత్తమ టెక్నీషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నారు. చిన్మయ్ సలాస్కర్ కెమెరా పని చేయనుండగా, కాంతారావు ఫేమ్ బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. మనీషా ఎ దత్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, డి శివ కామేష్ ఆర్ట్ డైరెక్టర్. నిరంజన్ దేవరమానే ఈ చిత్రానికి ఎడిటింగ్ వర్క్ చేయనున్నారు. క్రియేటివ్ హెడ్ జి కనిష్క .. సహ-రచయిత దరహాస్ పాలకొల్లు ఈ చిత్రానికి సృజనాత్మక సపోర్టర్స్ గా నిలిచారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.