రివ్యూ : 2023 బెస్ట్ ట్రైలర్ ఇదే!
ఈమధ్య ట్రైలర్స్ తోనే సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు మేకర్స్. ఆడియన్స్ కూడా ట్రైలర్ చూశాకే సినిమాపై ఓ అభిప్రాయానికి వస్తున్నారు.
2023 ఇయర్ ఎండింగ్ కి వచ్చేసాం. మరో నెల రోజులు అయితే న్యూ ఇయర్ వచ్చేస్తుంది. ఈ ఏడాది ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో కొన్ని సక్సెస్ సాధించాయి. మరికొన్ని అనుకున్న రీతిలో సక్సెస్ కాలేకపోయాయి. కాసేపు ఈ విషయం పక్కన పెడితే 2023 లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల ట్రైలర్స్ లో ఏది బెస్ట్ ట్రైలర్? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
ఈమధ్య ట్రైలర్స్ తోనే సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు మేకర్స్. ఆడియన్స్ కూడా ట్రైలర్ చూశాకే సినిమాపై ఓ అభిప్రాయానికి వస్తున్నారు. అలా ట్రైలర్ తోనే భారీ హైప్ క్రియేట్ చేసిన సినిమాలు ఈ ఏడాది చాలానే ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 'పఠాన్', 'జవాన్', 'టైగర్ 3', 'యానిమల్' లాంటి మూవీ ట్రైలర్స్ ఆడియన్స్ లో భారీ హైప్ క్రియేట్ చేశాయి. అయితే వీటిలో బెస్ట్ ట్రైలర్ ఏది? అనే విషయాన్నికొస్తే రణబీర్ కపూర్ 'యానిమల్' ట్రైలర్ ది బెస్ట్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు.
'పఠాన్' ట్రైలర్ జస్ట్ ఓకే అనిపించుకుంది. అందులో షారుఖ్ స్పై హీరోగా రెగ్యులర్ ఫార్మాట్ లొనే కనిపించాడు. కానీ దీపికా పదుకొనె మాత్రం హైలెట్ గా నిలిచింది. సినిమాపై ఓ మోస్తరుగానే ఆ ట్రైలర్ అంచనాలు పెంచింది. ఆ తర్వాత 'జవాన్' ట్రైలర్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అట్లీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ట్రైలర్ కట్ లొనే కమర్షియల్ యాంగిల్ లో అన్ని మసాలాలు కలిపేసి ఇచ్చినట్లు అనిపించింది. ఆ రూట్లో కమర్షియల్ సినిమాలు చూసే వారికి ఇది సరిపోతుంది అనుకున్నట్లు ట్రైలర్ వదిలారు.
ఇక ఆ తరువాత వచ్చిన సల్మాన్ 'టైగర్ 3' సినిమా ట్రైలర్ పరమ రొటీన్ అనిపించింది. కొన్ని షాట్స్ అయితే వీడియో గేమ్ మాదిరిగానే ఉన్నాయని నెటిజన్లు కనిపెట్టేశారు. భాయ్ టైగర్ ఫ్రాంచైజ్ రేంజ్ ను తగ్గించాడని కామెంట్స్ రావడంతో ఆ దెబ్బ ఓపెనింగ్స్ పై పడింది. టైగర్ సీరీస్ లలో ఇదే అతి తక్కువ బజ్ క్రియేట్ చేసేలా ట్రైలర్ విడుదలైంది.
ఇక లేటెస్ట్ గా రిలీజ్ అయిన 'యానిమల్' ట్రైలర్ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ గా మారింది. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన రోజు నుండి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వస్తోంది. అందుకు కారణం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ ట్రైలర్ ని ప్రజెంట్ చేసిన విధానమే. తండ్రి, కొడుకుల బాండింగ్ ని చాలా ఎమోషనల్ గా చూపిస్తూనే రణ్ బీర్ ని ఊర మాస్ క్యారెక్టర్ లో ప్రజెంట్ చేసిన విధానం, ట్రైలర్ లో కొన్ని కొన్ని యాక్షన్ షాట్స్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.
దాంతో 24 గంటల్లోనే ఈ ట్రైలర్ అన్ని భాషల్లో కలిపి 85 మిలియన్లకు పైగా వ్యూస్ అందుకుంది. సోషల్ మీడియాలో ఎక్కడో చోట ఈ ట్రైలర్ గురించి డిస్కషన్ జరుగుతూనే ఉంది. వీటన్నిటిని బట్టి ఇప్పటివరకు రిలీజ్ అయిన వాటిలో 'యానిమల్' ట్రైలర్ నంబర్ వన్ అని చెప్పడంలో డౌటే లేదు.
ఇక 'యానిమల్' తర్వాత ప్రభాస్ 'సలార్' ట్రైలర్ డిసెంబర్ 1న రాబోతోంది. యాక్షన్ డోస్ పై పట్టున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ KGF సీరీస్ లపై హైప్ రావడానికి ట్రైలర్స్ ఇంపాక్ట్ చూపించాయి. ఇక సలార్ ఆ రేంజ్ లో క్లిక్ అయ్యి 2024 బెస్ట్ ట్రైలర్స్ లో నిలుస్తుందా లేదా అనేది చూడాలి. అలాగే సలార్ తో పాటూ షారుక్ ఖాన్ 'డంకీ' ట్రైలర్ కూడా వస్తోంది. రాజ్ కుమార్ హిరాని అనే బ్రాండ్ ఒక్కటి చాలు అనేలా సినిమాకు హైప్ తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బాక్సాఫీస్ వద్ద హై రేంజ్ లో ఓపెనింగ్స్ రావాలి అంటే ట్రైలర్ స్ట్రాంగా గా ఉండాల్సిందే. ఏమోషన్ కామెడీ పై పట్టున్న ఈ దర్శకుడు ట్రైలర్ ను ఎలా ప్రజెంట్ చేస్తాడో చూడాలి.