భగవంత్ కేసరి సెన్సార్.. ఇది కలిసొచ్చేనా?
ఇక దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను అని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా తెరకెక్కించినట్లుగా చెబుతున్నారు.
నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమా ఈనెల 20వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇక సినిమాకు సంబంధించిన అన్ని పనులు కూడా పూర్తయ్యాయి. రీసెంట్ గా చిత్ర యూనిట్ సభ్యులు సెన్సార్ పనులను కూడా పూర్తి చేసుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఈ సినిమాలో శ్రీ లీల ఎమోషనల్ క్యారెక్టర్ లో నటించబోతోంది. అలాగే బ్యూటిఫుల్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ బాలయ్య బాబుకు జోడిగా నటించింది.
ఇక దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను అని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా తెరకెక్కించినట్లుగా చెబుతున్నారు. రీసెంట్ గా భగవంత్ కేసరి చిత్రం సెన్సార్ బోర్డ్ నుంచి U/A సర్టిఫికెట్ అందుకున్నారు. ఈ సినిమాలో పెద్దగా అభ్యంతరాలు తెలిపే యాక్షన్ డోస్ సన్నివేశాలు లేవట. అందుకే పెద్దగా కట్స్ లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ను అందించినట్లు తెలుస్తోంది.
మొత్తానికి భగవంత్ కేసరి సినిమాలో దర్శకుడు అనిల్ రావిపూడి ఫ్యామిలీ ఆడియెన్స్ కు కూడా పెద్దగా ఇబ్బంది పడకుండా సీన్స్ ను జత చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే కాజల్ తో వచ్చే కొన్ని లవ్ సీన్స్ విషయంలో మరీ ఓవర్ రొమాన్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమా రన్ టైమ్ 160 నిమిషాలు.
దర్శకుడు అనిల్ ఎక్కువగా ల్యాగ్ ఉండకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. సినిమాలో బాలయ్య బాబు రెండు బిన్నమైన షేడ్స్ లో కనిపిస్తాడట. వయసుకు తగ్గ పాత్ర తో పాటు ఫ్లాష్ బ్యాక్ లో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర కూడా ఈ సినిమాలో హైలెట్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ 15 నిమిషాలు కూడా విజిల్ వేసే విధంగా ఉంటుందట.
దాంతోపాటు ఒక ఎమోషనల్ పాయింట్ కూడా జనాలకు కనెక్ట్ అవుతుందనీ సమాచారం. ఇక బాలయ్య బాబు ఈ సినిమా ద్వారా ఒక మంచి మెసేజ్ కూడా ఇస్తాడు అని ఇప్పటికే ఒక న్యూస్ వైరల్ అయిపోయింది. సినిమా అయితే మంచి ప్రమోషన్స్ తో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకుంటుంటోంది. మరి విడుదల రోజు కంటెంట్ జనాలకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.