భగవంత్‌ కేసరిలో ఓ మంచి సీన్‌.. అందరి చర్చ అదే

నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన భగవంత్ కేసరి సినిమా దసరా కానుకగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది

Update: 2023-10-20 06:41 GMT

నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన భగవంత్ కేసరి సినిమా దసరా కానుకగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన భగవంత్ కేసరి సినిమా బాలయ్య అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులను మెప్పిస్తోంది అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. తుది కలెక్షన్స్‌ లెక్కలు వస్తే కానీ సినిమా ఫలితంపై క్లారిటీ రాదు.

ఆ విషయం పక్కన పెడితే ఈ సినిమా లో చిన్న పిల్లలపై సొంత వారు లేదా బయటి వారు చేస్తున్న అఘాయిత్యాల గురించి ఒక సీన్‌ ను పెట్టారు. లైంగిక స్పర్శలు, అసాధారణ స్పర్శల గురించి బాలకృష్ణ స్కూల్‌ లో చిన్న అమ్మాయిలకు చెప్పడంను దర్శకుడు అనిల్‌ రావిపూడి చూపించాడు. బాలయ్య వంటి స్టార్‌ హీరో సినిమా లో ఇలాంటి ఒక మంచి సన్నివేశం ఉండటం అభినందనీయం.

ఈ మధ్య కాలంలో అమ్మాయిలు చిన్నతనం లో లైంగిక వేధింపులకు గురి కాకుండా ఉండేందుకు గాను ఎలా ఉండాలి అనే విషయాలను ప్రభుత్వం ప్రచారం చేస్తున్నారు. తెలిసిన వారి స్పర్శలో కూడా గుడ్‌ టచ్‌, బ్యాచ్‌ లు ఉంటాయని పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అదే ఇప్పుడు కొన్ని స్వచ్చంద సంస్థలు చేస్తున్నాయి.

స్వచ్ఛంద సంస్థలు ఎంతగా ప్రచారం చేసినా కూడా ఆశించిన స్థాయిలో పని జరుగదు... కానీ సినిమాల్లో అది కూడా పెద్ద హీరోల సినిమా ల్లో చూపించడం వల్ల ఎంతో కొంత వరకు అయినా ఫలితం ఉంటుంది అనడంలో సందేహం లేదు. బాలయ్య వంటి స్టార్‌ హీరో సినిమాలో గుడ్ టచ్‌, బ్యాడ్ టచ్ గురించి చర్చించడం ద్వారా ఒక మంచి సన్నివేశం ను అందరి వద్దకు తీసుకు వెళ్లారు.

అమ్మాయిలకు తల్లిదండ్రులు కొందరు ఇలాంటి విషయాలను డైరెక్ట్‌ గా చెప్పలేక పోతున్నారు. కనుక సినిమాలో ఇలాంటి సన్నివేశాలు ఉన్నప్పుడు.. వారు చూసినప్పుడు అర్థం చేసుకుని, జాగ్రత్తగా ఉండే అవకాశాలు ఉంటాయని పిల్లల తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News