ఫస్ట్ మూవీ ఫ్లాప్.. ఛాన్స్ లు మాత్రం ఫుల్!!

అదే సమయంలో డెయిరీ మిల్క్ యాడ్ తో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన భాగ్యశ్రీ.. 2023లో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

Update: 2025-01-02 20:30 GMT

సినీ ఇండస్ట్రీకి ఎప్పటికప్పుడు కొత్త అందాలు పరిచయమవుతూనే ఉంటాయి. అలా 2024లో ఒక్కసారిగా దూసుకొచ్చిన బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. మహారాష్ట్రకు చెందిన అమ్మడు.. ఔరంగాబాద్ లో పుట్టి నైజీరియాలో పెరిగింది. ఆ తర్వాత మళ్లీ ముంబై వచ్చేసి ఇంటర్ చదువుతూనే మోడల్ గా క్రేజ్ సంపాదించుకుందట.

అదే సమయంలో డెయిరీ మిల్క్ యాడ్ తో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన భాగ్యశ్రీ.. 2023లో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. యారియన్ -2లో నటించిన ఆమె యాక్టింగ్ మంచి మార్కులే పడ్డాయి. అలా టాలీవుడ్ మేకర్స్ దృష్టిని ఆకర్షించిన ముద్దుగుమ్మ.. రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది.

బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ భాగ్యశ్రీ అందంతోపాటు అభినయానికి వేరే లెవెల్ లో ప్రశంసలు వచ్చాయి. మూవీలో మార్వాడీ అమ్మాయిగా కనిపించిన ఆమె.. తన డైలాగ్స్ తో ఫిదా చేసేందని చెప్పాలి. ఇప్పుడు చేతినిండా చిత్రాలతో ఫుల్ జోరు మీద ఉన్న భాగ్యశ్రీ.. వరుస సినిమాలతో సందడి చేయనుందన్నమాట.

అదే మిస్టర్ బచ్చన్ హిట్ అయింటే.. భాగ్యశ్రీకి క్రేజ్ వేరే లెవెల్ లో ఉండేదేమో. కానీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో నటిస్తోంది. మంచి ఆఫర్స్ ను ఖాతాలో వేసుకుంటున్న ఆమె.. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయిందనే చెప్పాలి. ప్రస్తుతం VD 12, RAPO 22, కాంత మూవీస్ లో యాక్ట్ చేస్తోంది భాగ్యశ్రీ.

రామ్ పోతినేని, మహేష్ బాబు.పి కాంబోలో తెరకెక్కుతున్న RAPO 22 నుంచి భాగ్యశ్రీ ఫస్ట్ లుక్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా.. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మహాలక్ష్మి రోల్ లో యాక్ట్ చేస్తున్న ఆమె.. పోస్టర్ లో చాలా క్యూట్ గా ఉంది. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి VD 12 నుంచి త్వరలో ఆమె లుక్ రివీల్ కానుంది!

అదే సమయంలో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చిన భాగ్య శ్రీ.. ఇప్పుడు మాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. దుల్కర్ సల్మాన్, రానా నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ కాంతలో హీరోయిన్ గా నటిస్తున్న ఆమె.. మలయాళంలో కూడా తన లక్ ను టెస్ట్ చేసుకోనుందనే చెప్పాలి. మరి ఫ్యూచర్ లో భాగ్యశ్రీ బోర్సే తన అప్ కమింగ్ మూవీస్ తో ఎలాంటి హిట్స్ కొడుతుందో.. ఎలా మెప్పిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News