దిష్టి తీయించుకుని దిగింది థియేటర్ ని ఊపేసింది!
తొలి సినిమా తోనే భాగ్య శ్రీ హిట్ అందుకుంటుందనే టాక్ బలంగా వినిపిస్తోంది.
జాన్వీకపూర్ తర్వాత లక్కీ గాళ్ ఎవరంటే? కచ్చితంగా మరో బాలీవుడ్ బ్యూటీ భాగ్య శ్రీ బోర్సే పేరు వినిపిస్తుంది. బాలీవుడ్ లో'యారియాన్ -2' తో లాంచ్ అయిన అమ్మడికి తెలుగులో అవకాశం రావడానికి పెద్దగా సమయం పట్టలేదు. ఏడాది గ్యాప్లోనే ఛాన్స్ అందుకుంది. మాస్ రాజా రవితేజ కథానా యకుడిగా నటిస్తోన్న'మిస్టర్ బచ్చన్' సినిమాలో దర్శకుడు హరీష్ శంకర్ ఈ అందానికి అవకాశం కల్పించడంతోనే ఇదంతా సాధ్యమైంది.
ఇప్పటికే సినిమాపై పాజిటివ్ టాక్ ఉంది. ప్రచార చిత్రాలు మంచి హైప్ తీసుకొస్తున్నాయి. తొలి సినిమా తోనే భాగ్య శ్రీ హిట్ అందుకుంటుందనే టాక్ బలంగా వినిపిస్తోంది.ఈ నేపథ్యంలో తాజాగా అమ్మడు ఈసినిమా ప్రమోషన్ లో భాగంగా ఎర్రచీరలో తళుక్కున మెరిసింది. అంతేనా వచ్చి రాగానే థియేటర్లో ఆమె కోసం వెయిట్ చేస్తోన్నకుర్రాళ్లందరిచే విజిల్స్ సైతం వేయించింది.
అంతకు ముందు హోటల్ రూమ్ లో ఎంతో అందంగా ముస్తాబైంది. పద్దతైన చీర...రవిక ధరించి తెలుగు పడుచులా హైలైట్ అయింది. ఆ అందానికి దిష్టి కూడా తీయించుకుంది. ఎండు మీరపకాయలు...ఉప్పు చేతిలో పట్టుకుని మూడు రౌండ్లు తిప్పిన తర్వాత తూ తూతూ అంటూ ఉమ్మమని చెప్పి మరీ ఎవరి దిష్టి తగలకుండా జాగ్రత్త పడింది. అక్కడ నుంచి నేరుగా థియేటర్లో నిర్వహించిన ఈవెంట్కి హాజరైంది.
అప్పటికే అభిమానులతో థియేటర్ నిండిపోయింది. భాగ్య శ్రీ ఎంటర్ అవ్వగానే అందానికి అంతా ఫిదా అయ్యారు. దీంతో అమ్మడు సైతం వాళ్లలో ఉత్సాహాన్ని రెట్టింపుచేసేలా చివర్లో రెండు..మూడు స్టెప్పులు కూడా వేసింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈసినిమా రిలీజ్ కి ముందే మరో రెండు ఛాన్సులు అందుకుంది. అందులో ఒకటి విజయ్ దేవరకొండ సరసన గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ అన్నది తెలిసిందే. మరో సినిమా వివరాలు తెలియాల్సి ఉంది.