మిస్టర్ బచ్చన్ సీక్రెట్ రివీల్ చేసిన హీరోయిన్

హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ మూవీ ఆగస్టు 15న రిలీజ్ కాబోతోంది.

Update: 2024-08-12 07:05 GMT

హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ మూవీ ఆగస్టు 15న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, ట్రైలర్ కి మంచి స్పందన లభించింది. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మిస్టర్ బచ్చన్ మూవీ ఉండబోతుందని ట్రైలర్ బట్టి తెలుస్తోంది. ఈ సినిమాలో జగపతిబాబు ప్రతినాయకుడిగా నటించారు.


ఇదిలా ఉంటే మిస్టర్ బచ్చన్ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. టాలీవుడ్ లో ఆమెకి లీడ్ రోల్ లో ఇదే మొదటి సినిమా. ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ లో భాగ్యశ్రీని హరీష్ శంకర్ అద్భుతంగా ఆవిష్కరించారు. అతిలోక సుందరి శ్రీదేవిలా ఆ సాంగ్స్ లో ఆమె అందం ఉందనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ యాక్టివిటీస్ జోరుగా నడుస్తున్నాయి.

రవితేజ, భాగ్యశ్రీ, దర్శకుడు హరీష్ శంకర్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో భాగ్యశ్రీ బోర్సే మిస్టర్ బచ్చన్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేసింది. మిస్టర్ బచ్చన్ పూర్తి కథని దర్శకుడు హరీష్ శంకర్ తనకు నేరేట్ చేయలేదని స్పష్టం చేసింది. కేవలం తన క్యారెక్టర్ కి సంబంధించిన అవుట్ లైన్ మాత్రమే ఆయన చెప్పారని తెలిపింది.

అయితే హరీష్ శంకర్ గారు తనపై పూర్తిస్థాయిలో నమ్మకం ఉంచాలని చెప్పడంతో ఆయన్ని ఫాలో అయిపోయానని క్లారిటీ ఇచ్చింది. ఓ విధంగా హరీష్ శంకర్ తనకి గురువు అని భాగ్యశ్రీ చెప్పుకొచ్చింది. ఆయన కూడా స్క్రీన్ పై తనని చాలా అందంగా చూపించారని పేర్కొంది. స్క్రీన్ మీద నేను ఎలా కనిపించిన దాని కంప్లీట్ క్రెడిట్ అంతా హరీష్ శంకర్ కి దక్కుతుందని తెలిపింది.

హరీష్ శంకర్ గతంలో గబ్బర్ సింగ్ లో శృతిహాసన్ ని స్క్రీన్ పై అద్భుతంగా ఆవిష్కరించారు. అదే తరహాలో మిస్టర్ బచ్చన్ సినిమాలో భాగ్యశ్రీ బోర్సేని కూడా ప్రజెంట్ చేశారు. మిస్టర్ బచ్చన్ మూవీ రిలీజ్ కాకుండానే ఇప్పుడు భాగ్యశ్రీ మరో రెండు పెద్ద ప్రాజెక్టులను ఓకే చేసింది. అందులో విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న VD12 ఒకటి కావడం విశేషం. ఈ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రెడీ అవుతోంది.

Tags:    

Similar News