భారతీయుడు 2… షాక్ ఇచ్చిన నెట్ ఫ్లిక్స్

యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కలియకలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం భారతీయుడు 2

Update: 2024-07-31 06:27 GMT

యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కలియకలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం భారతీయుడు 2. 28 ఏళ్ళ క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ భారతీయుడు సీక్వెల్ గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకురావడం విశేషం. అయితే 2017 లోనే స్టార్ట్ అయిన ఈ సినిమా అనేక అవాంతరాలని దాటుకుని జూలై 12న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యింది. రెండు భాగాలుగా ఈ సీక్వెల్ ని శంకర్ తెరకెక్కించారు.

భారతీయుడు పార్ట్ 2 మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేయగా ఊహించని స్థాయిలో డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి రోజు మొదటి ఆట నుంచే ఈ సినిమాకి బ్యాడ్ టాక్ రావడంతో తరువాత ఎక్కడ కూడా కోలుకోలేదు. దీంతో రిలీజ్ అయిన అన్ని భాషలలో ఈ మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. 250 కోట్ల బిజినెస్ టార్గెట్ తో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రాగా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 146.58 కోట్ల కలెక్షన్స్ ని మాత్రమే అందుకుంది.

దీంతో భారీ నష్టాలని ఈ సినిమా నిర్మాతలకి తీసుకొచ్చింది. శంకర్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా ఈ చిత్రం మారింది. భారతీయుడు 2 డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ 120 కోట్లకి రిలీజ్ ముందే కొనుగోలు చేసింది. అయితే ఊహించని స్థాయిలో మూవీ డిజాస్టర్ కావడంతో డిజిటల్ ఆడియన్స్ ని కూడా ఈ సినిమా ఎంగేజ్ చేసే ఛాన్స్ ఉండదని నెట్ ఫ్లిక్స్ యాజమాన్యం భావిస్తుందంట. అందుకే ముందు మాట్లాడుకున్న స్థాయిలో 120 కోట్లు ఇవ్వడానికి నెట్ ఫ్లిక్స్ సిద్ధంగా లేదని తెలుస్తోంది.

ప్రస్తుతం నిర్మాతలతో ఈ డిజిటల్ రైట్స్ పై చర్చలు నడుస్తున్నాయంట. ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చిన తర్వాతనే డిజిటల్ స్ట్రీమింగ్ కి భారతీయుడు 2 వచ్చే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది. గతంలో అఖిల్ ఏజెంట్ మూవీ కూడా అలాగే అమెజాన్ ప్రైమ్ రిలీజ్ కి ముందే కొనుగోలు చేసింది. అయితే మూవీ డిజాస్టర్ కావడంతో డిజిటల్ రైట్స్ డీల్ క్యాన్సిల్ చేసుకుందనే టాక్ వినిపించింది. ఇప్పటికి ఏజెంట్ మూవీ ఓటీటీలో రిలీజ్ కాకపోవడం వెనుక ఇది ఒక రీజన్ అని టాక్.

ఇప్పుడు భారతీయుడు 2 విషయంలో నెట్ ఫ్లిక్స్ కూడా అలాగే వెనక్కి తగ్గిందంట. డిజిటల్ స్ట్రీమింగ్ కంపెనీలు సినిమాలని థియేటర్స్ లో కచ్చితంగా రిలీజ్ చేయాలనే నిబంధన మీద రైట్స్ ని కొనుగోలు చేస్తున్నాయి. ఒక వేళ థియేటర్స్ లో ప్రేక్షకాదరణ రాకుంటే ముందు అనుకున్న డీల్ ని క్యాన్సిల్ చేసుకోవడానికి లేదంటే ఆఫర్ చేసిన ధరని తగ్గించడానికి రెడీ అవుతున్నాయని తెలుస్తోంది.

Tags:    

Similar News