చిరు రెమ్యునరేషన్ కాంట్రవర్సీ.. అనిల్ సుంకర క్లారిటీ

రీసెంట్ గా రిలీజైన మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే.

Update: 2023-08-15 05:29 GMT

రీసెంట్ గా రిలీజైన మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మాతగా భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమాకు వసూళ్లు కూడా దారుణంగా నమోదు అవుతున్నాయి. రోజురోజుకు వసూళ్లు డ్రాప్ అవుతున్నాయి.

దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఈ సినిమాపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ట్రోల్స్ ఫుల్ గా కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా చిరు రెమ్యునరేషన్ గురించి, నిర్మాత అనిల్ సుంకర పేరు బాగా వినిపిస్తోంది. తన రెమ్యునరేషన్ ను చిరంజీవి... అనిల్ సుంకర నుంచి ముక్కు పిండి మరీ వసూలు చేశారని తెగ అంటున్నారు. ఇందుకోసం అనిల్.. ఏకంగా తన ఆస్తులను తాకట్టు పెట్టారని కూడా కథనాలు వస్తున్నాయి.

అయితే తాజగా ఈ వార్తలకు అనిల్ సుంకర చెక్ పెట్టారు. తాను దివాల తీశానంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని తేల్చి చెప్పారు. అన్ని అవాస్త ప్రచారమని, చిరంజీవితో తాను మరో సినిమా చేస్తానని పక్కా క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఓ స్క్రీన్ షాట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ఓ అభిమాని నేరుగా అనిల్ సుంకరకే మెసేజ్ చేసి చిరు రెమ్యునరేషన్ ప్రచార వార్త గురించి మాట్లాడుతూ.. సార్..ఇది నిజమేనా? అని అడగగా.. తాను అమెరికాకు వెళుతున్నానని, పుకార్లన్నీ పట్టించుకోవద్దు..నేను మళ్లీ చిరంజీవిగారితో మరో సినిమా చేస్తాను..ఆయన చాలా మంచివారు..మరో సినిమాతో అయినా సమాధానం చెబుదాం అంటూ అనిల్ బదులిచ్చినట్లు ఆ స్క్రీన్ షాట్ లో ఉంది. దీంతో చిరుపై వస్తున్న విష ప్రచారానికి తెర పడినట్టైంది. ప్రస్తుతం ఈ స్క్రీన్ షాట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

అంతకుముందు కూడా బేబీ మూవీ దర్శకుడు సాయి రాజేశ్ కూడా ఈ విషయంపై మాట్లాడారు. ఇదంతా అబద్ధమని కావాలనే కొంతమంది ఇలాంటి అసత్య ప్రచారాన్ని స్ప్రెడ్ చేస్తున్నారని గట్టిగా మండి పడ్డారు. చిరంజీవి ఎంతో గొప్ప మనిషి అని, ఆయనతో జరిగిన ఓ సంఘటనను కూడా గుర్తుచేస్తున్నారు. అనిల్ సుంకర దగ్గర పనిచేసే ఓ వ్యక్తికి తాను ఫోన్ చేసి జరిగిన అసలు విషయాన్ని తెలుసుకున్నానని పేర్కొన్నారు. ఫైనల్ గా ట్రోలర్స్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు.

Tags:    

Similar News