ఆ హీరో సోలో స‌క్సెస్ కొడితే రాక్ సాలిడ్ గానే బాస్!

`ఒక్కొక్క‌ర్ని కాదు షేర్ ఖాన్..వంద‌మందిని ఒకేసారి ర‌మ్మ‌ను` అనే ఓ ఫేమ‌స్ డైలాగ్ తెలిసిందే.

Update: 2024-10-27 11:30 GMT

`ఒక్కొక్క‌ర్ని కాదు షేర్ ఖాన్..వంద‌మందిని ఒకేసారి ర‌మ్మ‌ను` అనే ఓ ఫేమ‌స్ డైలాగ్ తెలిసిందే. స‌రిగ్గా ఇప్పుడీ డైలాగ్ `భూల్ భుల‌య్యా-3` కి,` సింగం ఎంగైన్` కి స‌రితూగుతుందేమో. యంగ్ హీరో కార్తీక్ ఆర్య‌న్ సోలోగా ఒక్క‌డే బాక్సాఫీస్ బ‌రిలోకి దిగుతుంటే? సింగం గ్యాంగ్ ఐదారుగురితో క‌లిసి వార్ లో కి దిగుతుంది. అవును `సింగం ఎగైన్` భారీ కాన్సాస్ పై తెర‌కెక్కిన చిత్రం. అజ‌య్ దేవ‌గ‌ణ్, ర‌ణ‌వీర్ సింగ్, అక్ష‌య్ కుమార్, టైగ‌ర్ ష్రాఫ్‌, జాకీ ష్రాఫ్‌, అర్జున్ క‌పూర్, క‌రీనా క‌పూర్, దీపికా ప‌దుకొణే ఇలా టాప్ స్టార్లు అంతా రంగంలోకి దిగారు.

కానీ `భూల్ భుల‌య్య -3` కోసంయంగ్ హీరో అర్యాన్ ఖాన్ ఒక్క‌డే బ‌రిలో ఉన్నాడు. ఈ రెండు చిత్రాలు దివాలీ సంద‌ర్భంగా ఒకే రోజు న‌వంబ‌ర్ 1న‌ రిలీజ్ అవుతున్నాయి. రెండు హిట్ ప్రాంచైజీలు కావ‌డంతో అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఓపెనింగ్స్ పెద్ద ఎత్తున వ‌స్తాయ‌నే అంచ‌నాలు అంత‌కంత‌కు పెరిగిపోతున్నాయి. ఇంకా అడ్వాన్స్ బుకింగ్ లు ఓపెన్ కాన‌ప్ప‌టికీ అందులో ఎలాంటి ధీమా అవ‌స‌రం లేదు. అయితే అంతిమంగా బాక్సాఫీస్ విజేత ఎవ‌రు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

`సింగం ఎగైన్` హిట్ కొట్టినా? పెద్ద లెక్క‌లోకి రాదు. కాఫ్ స్టోరీ సహా అందులో భారీ తారాగ‌ణం ఉంది. అంద‌రూ క‌లిసొచ్చారు? అనే ట్యాగ్ ప‌డ‌పోతుంది. కానీ ఆర్య‌న్ ఖాన్ హిట్ కొడితే మాత్రం అది రాక్ సాలిడ్ గా ఉంటుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇండ‌స్ట్రీకి కొత్త‌గా వ‌చ్చిన న‌టుడు. అందులోనూ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన న‌టుడు. అలాంటి వాడు హిట్ కొడితే సౌండింగ్ మామూలుగా ఉండ‌దు. `భూల్ భూల‌య్య‌-3` విష‌యంలో అభిమానులంతా అదే ధీమాతో ఉన్నారు.

పండ‌గ‌ల సెంటిమెంట్ ని ఇత‌డు రిపీట్ చేయ‌గ‌ల స‌త్తా ఉన్న న‌టుడు అన్న టాక్ వినిపిస్తోంది. సాధార‌ణంగా కోవిడ్ ముందు కూడా దీపావ‌ళి రిలీజ్ లు పెద్ద‌గా స‌క్సెస్ అవ్వ‌లేదు. అలాగే ఈద్ సంద‌ర్భంగా రిలీజ్ అయిన చిత్రాలు కూడా ఏమంత గొప్ప ఫ‌లితాలు సాధించ‌లేదు. ఆ ర‌కంగా పండ‌గ వైఫ‌ల్యం అనే సెంటిమెంట్ బాలీవుడ్ ని వెంటాడుతుంది. దాన్నిసైతం తిర‌గ‌రాయ‌గ‌ల స‌త్తా ఉన్న న‌టుడు? ఆర్య‌న్ అంటూ అభిమానులు కాన్పిడెంట్ గాఉన్నారు. పైగా ఈ సినిమాకు థియేట‌ర్ల ప‌రంగా అన్యాయం జ‌రుగుతుంద‌నే ప్ర‌చారం కూడా ఉంది. `సింగం ఎగైన్` కి అధిక మొత్తంలో థియేట‌ర్లు కేటాయిస్తున్న‌ట్లు ప్ర‌చారంలో ఉంది. మ‌రి ఆ లెక్క బ్యాలెన్స్ అయిందా? లేదా? అన్న‌ది క్లారిటీ లేని అంశం.

Tags:    

Similar News