ప్రభాస్ 'స్పిరిట్' స్పీడ్ విషయంలో...!
స్పీడ్ విషయంలో అందరినీ సర్‌ప్రైజ్ చేసే విధంగా స్పిరిట్ మేకింగ్ ఉంటుందని అంటున్నారు.
ప్రభాస్ సలార్, కల్కి 2898 ఏడీ సినిమాల తర్వాత చేస్తున్న సినిమా రాజాసాబ్. మరో వైపు హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాను సైతం చేస్తున్నాడు. ఇన్ని సినిమాలు చేస్తున్న ప్రభాస్ తన స్పిరిట్ సినిమాను ఎప్పటికీ పూర్తి చేస్తాడో అని అంతా అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ రూపొందించబోతున్న స్పిరిట్ సినిమా కనీసం రెండేళ్ల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి. కానీ ప్రభాస్ కోరిక మేరకు దర్శకుడు సందీప్ వంగ చాలా స్పీడ్‌గా స్పిరిట్ సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నాడు. స్పీడ్ విషయంలో అందరినీ సర్‌ప్రైజ్ చేసే విధంగా స్పిరిట్ మేకింగ్ ఉంటుందని అంటున్నారు.
ఇటీవల నిర్మాత భూషన్ కుమార్ మాట్లాడుతూ ఈ ఏడాది డిసెంబర్‌లోనే సినిమాను మొదలు పెట్ట కేవలం ఆరు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసే విధంగా ప్లాన్ చేస్తున్నామని చెప్పుకొచ్చాడు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సైతం అదే విషయాన్ని సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చాడు. ఒక వైపు ప్రభాస్ ఫౌజీ, రాజాసాబ్, సలార్ 2 సినిమాలు చేస్తూ ఉండగానే స్పిరిట్ సినిమాను సైతం చేయబోతున్నాడు. నాలుగు సినిమాలు సమాంతరంగా షూటింగ్ సాగుతాయని తెలుస్తోంది. అయినా స్పిరిట్ ను కేవలం అయిదు, ఆరు నెలల్లోనే పూర్తి చేస్తామని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ చెప్పడం ఆశ్చర్యం గా ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
డిసెంబర్‌లో స్పిరిట్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. అదే సమయంలో అంటే డిసెంబర్ లేదా జనవరి వరకు రాజాసాబ్ సినిమా షూటింగ్ పూర్తి చేసే విధంగా మారుతి స్పీడ్‌గా వర్క్ చేస్తున్నాడట. ఇక ఫౌజీ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లేదా ఆగస్టు వరకు పూర్తి చేసే విధంగా హను ప్లాన్ చేస్తున్నాడు. సలార్ 2 ను ఇటీవలే ప్రారంభించిన ప్రశాంత్ నీల్ ఇప్పటికే కొన్ని సన్నివేశాలను షూట్ చేశారు. సలార్ 1 తో పాటే సలార్ 2 కి సంబంధించిన కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. కనుక ఇప్పుడు సలార్ 2 కోసం ఎక్కువ రోజులు పని చేయాల్సిన పని లేదంటూ వార్తలు వస్తున్నాయి.
వచ్చే ఏడాది సమ్మర్‌లో రాజాసాబ్ సినిమా వస్తే అదే ఏడాది ఫౌజీ సినిమా వస్తుంది. ఇక స్పిరిట్ సినిమాను 2026 ఆరంభంలో విడుదల చేస్తామని మేకర్స్ చెబుతున్నారు. ఆరు నెలల్లోనే షూటింగ్‌ను పూర్తి చేసి యానిమల్ పార్క్‌ని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ చేసే ఉద్దేశ్యంతో ఉన్నారు. ప్రభాస్ మాత్రం సినిమాల ఎంపిక విషయంలో 1980 హీరోలను గుర్తు చేస్తున్నారు. ఏడాదికి ఒక్కటే కష్టం అనుకుంటూ ఉంటే రెండు మూడు సినిమాలను తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇది మామూలు విషయం కాదు.