బిగ్ ఫైట్ తప్పదు..మరి ఈ పరిస్థితిని దాటేదెలా!
శివకార్తికేయన్ ని పక్కన బెట్టినా మిగిలిన ఇద్దరు హీరోల నుంచి పోటీ తప్పదు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
2024 సంక్రాంతి రిలీజ్ కి హీరోలు రెడీ అయిపోతున్నారు. బాక్సాఫీస్ వద్ద ఒకరికొకరు పోటీ పడటానికి అన్ని రకాలుగా సంసిద్ధమవుతున్నారు. ఇప్పటికే మహేష్..వెంకటేష్..కళ్యాణ్ రామ్ చిత్రాలు రిలీజ్ తేదీల్ని లాక్ చేసి పెట్టారు. ఇవిగాక స్ట్రెయిట్ తెలుగు సినిమాలు ఇంకా చాలానే ఉన్నాయి. వీటితో పాటు తమిళ అనువాద సినిమాలు క్యూలో ఉన్నాయి. వీటి నుంచి తెలుగు హీరోలకు గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది.
సూపర్ స్టార్ రజనీకాంత్..ధనుష్.. శివ కార్తికేయన్ సినిమాలు సంక్రాంతి రేసులో ఉన్నాయి. శివకార్తికేయన్ ని పక్కన బెట్టినా మిగిలిన ఇద్దరు హీరోల నుంచి పోటీ తప్పదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. జైలర్ తో రజనీ ఫాంలో కి రాగా...సార్ తో ధనుష్ స్వింగ్ లో ఉన్నాడు. తెలుగు లో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో వాళ్ల సినిమాలు ఇక్కడ అనువాద రూపంలో విడుదల కానున్నాయి.
ఇంకా లెక్కలోకి రాని సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే బాక్సాఫీస్ కన్నా పోటీ ముందే థియేటర్ల కోసం పెద్ద ఎత్తున కాంపిటీషన్ కనిపిస్తుంది. ఇంత మంది హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే థియేటర్ల సర్దుబాటు ఎంత కష్టంగా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అన్ని సినిమాలకు పరిమితంగా థియేటర్లు ఇస్తారా? అంటే అలా ఉండదు. ఇక్కడ ఎవరి ఇన్ ప్లూయెన్స్ వారు ఉపయోగించి థియేటర్లు సంపాదిం చుకోవడంమే.
మహేష్..వెంకటేష్..కళ్యాణ్ రామ్ చిత్రాల వరకూ ఎలాంటి ఇబ్బంది ఉండదు. అన్నీ ఏరియాల్లో థియేటర్లు దొరుకుతాయి. మిగతా సినిమాలకే థియేటర్లు అనేది కష్టమైన అంశంగా కనిపించొచ్చు. హిట్ టాక్ తెచ్చుకు న్నా కొన్ని సినిమాలకు థియేటర్ల సంఖ్యం పెంచడం అన్నది అంత ఈజీకాదు. అగ్ర హీరోల సినిమాలుం టాయి కాబట్టి ఎలా లేదన్నా వారం రోజులు వెయిటింగ్ తప్పదు.
ముఖ్యంగా మీడియం రేంజ్..ఇతర భాషల హీరోల సినిమాలకు బీసీ సెంటర్లనేవి అతి కష్టంగా దొరుకు తాయి. చిన్న చిన్న పట్టణాల్లో...మున్సీపాలిటీల్లో హిట్ అయిన సినిమాలు మన టౌన్ ఏరియాలో రిలీజ్ అవ్వలేదు? అంటి అని చర్చించుకున్న సందర్భాలెన్నో. ఈ సంక్రాంతికి అలాంటి చర్చ తప్పదనే చెప్పాలి. పండగలు..సెలవులు టార్గెట్ చేస్తే కొన్ని సినిమాలకు ఈ తరహా సమస్యలు సాధారణంగా తలెత్తేవే.