బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీతో పాటు భారీ రెమ్యునరేషన్ కూడా..!

బిగ్ బాస్ సీజన్ 8 లో ఉత్కంఠతతో సాగిన ఫైనల్ ఎపిసోడ్ లో విజేతగా నిఖిల్ నిలిచాడు. కన్నడ యాక్టర్ అయిన అతను తెలుగులో సీరియల్స్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

Update: 2024-12-16 04:20 GMT

బిగ్ బాస్ సీజన్ 8 లో ఉత్కంఠతతో సాగిన ఫైనల్ ఎపిసోడ్ లో విజేతగా నిఖిల్ నిలిచాడు. కన్నడ యాక్టర్ అయిన అతను తెలుగులో సీరియల్స్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తెలుగులో గోరింటాకు సీరియల్ తో కెరీర్ ప్రారంభించిన అతను ఆ తర్వాత వరుస షోలు చేస్తూ వచ్చాడు. ఐతే బిగ్ బాస్ సీజన్ 8 లో మొదటి నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతూ వచ్చిన నిఖిల్ మధ్యలో కాస్త గ్రాఫ్ పడిపోయినా సరే ఫైనల్ వీక్స్ లో ప్రేక్షకులను మెప్పించాడు.

బిగ్ బాస్ హౌస్ లో టాస్కుల్లో తన సత్తా చాటి ఎప్పుడు టాప్ లో ఉంటూ వచ్చిన నిఖిల్ విన్నర్ గా గౌతం తో సూపర్ ఫైట్ చేశాడు. ఐతే సీజన్ 8 విన్నర్ గా గెలిచిన నిఖిల్ కు ప్రైజ్ మనీ 55 లక్షలు అందుతాయి. వీటితో పాటు హౌస్ లో మొదటి వారం నుంచి 15 వారం దాకా ఉన్నాడు కాబట్టి అతనికి రెమ్యునరేషన్ గా కూడా పెద్ద మొత్తం లో అందనుంది. వారానికి 2.25 లక్షల రెమ్యునరేషన్ తో హౌస్ లోకి వెళ్లిన నిఖిల్ 15 వారాల పాటు ఉన్నందుకు 33.75 లక్షలు అందుకోనున్నాడు.

ప్రైజ్ మనీ 55 లక్షలతో పాటు 33.75 లక్షలు కలిపి 88 లక్షల దాకా మొత్తం అందుకున్నాడని తెలుస్తుంది. దీనితో పాటుగా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయినందుకు సుజుకి నుంచి డిజైర్ ని కూడా కానుకగా అందుకున్నాడు. సీజన్ 8 లో మొదటి నుంచి తన స్ట్రాంగ్ నెస్ చూపిస్తూ వచ్చిన నిఖిల్ విన్నర్ గా నిలవడం అతని ఫ్యాన్స్ ని మెప్పిస్తూ వచ్చింది.

నిఖిల్ టాస్కుల్లో అదరగొట్టగా లేడీ కంటెస్టెంట్స్ తో కొంత ఫేక్ ఎమోషన్స్ నడిపించాడన్న టాక్ ఉంది. అవేవి అతన్ని విజేత కాకుండా అడ్డు పడలేదు. గౌతం కూడా చివరి వరకు పోటా పోటీ ఇచ్చినా ఫైనల్ గా విన్నర్ గా మాత్రం నిఖిల్ నిలిచాడు. సీజన్ 8 లో నిఖిల్ కాన్ స్టంట్ ఆట ఆడుతూ మొదటి నుంచి ఆడియన్స్ కి ఎంగేజ్ అవుతూ వచ్చాడు. అందుకే అతన్ని ఆడియన్స్ విజేతగా నిలబెట్టారు. నిఖిల్ 105 రోజులు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చేలా చేసుకున్నాడు. 15 వారాల పాటు హౌస్ లో తన ఆట తీరుతో మెప్పించి ప్రైజ్ మనీతో పాటు భారీ పారితోషికాన్ని అందుకున్నాడు.

Tags:    

Similar News