బిగ్ బాస్ 8 : ప్రేరణకు జర్నీ బూస్ట్.. నబీల్ కి ఎనర్జీ.. నిఖిల్ సంబరాలు..!
బిగ్ బాస్ సీజన్ 8లో గురువారం గౌతమ్, అవినాష్ ల జర్నీ చూపించగా శుక్రవారం ఎపిసోడ్ లో నిఖిల్, ప్రేరణ, నబీల్ ల జర్నీ చూపించారు.
బిగ్ బాస్ సీజన్ 8లో గురువారం గౌతమ్, అవినాష్ ల జర్నీ చూపించగా శుక్రవారం ఎపిసోడ్ లో నిఖిల్, ప్రేరణ, నబీల్ ల జర్నీ చూపించారు. ముందుగా నిఖిల్ జర్నీ చూపించాడు బిగ్ బాస్. నిఖిల్ కూడా తన జర్నీ చూసి ఎమోషనల్ అయ్యాడు. బిగ్ బాస్ వచ్చే వరకు నాన్న ఎలా ఉండాలో చెప్పాడు. ఇక్కడ నుంచి వెళ్లేప్పుడు ఇక్కడ నేర్చుకున్న విషయాలతో మీరు ఎలా ఉండాలో నేర్పించారని అన్నాడు. తన జర్నీ చూసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు నిఖిల్.
ఇక తర్వాత ప్రేరణ జర్నీ చూపించాడు బిగ్ బాస్. ప్రేరణ గురించి కూడా చాలా బాగా చెప్పాడు. ఆమె జర్నీ అయితే గొడవలు, టాస్కుల్లో ఫైట్లు ఇలా అన్నిటిలో తన సత్తా చాటింది. ఐతే కొంత నెగిటివిటీ వచ్చినా మళ్లీ తన ఆట తీరుతో మెప్పిస్తూ వచ్చింది ప్రేరణ. ఫైనల్ గా టాప్ 5 కి చేరి తన సత్తా చాటింది. ప్రేరణ జర్నీ చూసి ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంది.
చివరగా నబీల్ జర్నీని చూపించాడు బిగ్ బాస్. అతను కూడా సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా వచ్చి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారాడు. నబీల్ జర్నీ కూడా హైస్ అండ్ లోస్ తో చూపించాడు. తన కెరీర్ కు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పాడు బిగ్ బాస్. హౌస్ లో టాప్ 5 గా ఉన్న వారు తమ బిగ్ బాస్ జర్నీ చూసుకుని చాలా సంతోషంగా ఉన్నారు. 14 మంది కంటెస్టెంట్స్ తో పాటుగా వైల్డ్ కార్డ్స్ మరో 8 మంది వారందరినీ దాటుకుని టాప్ 5 గా నిలబడటం అన్నది సామాన్యమైన విషయం కాదు.
బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం టాప్ 5 ఉన్నారు. ఆదివారం ఎపిసోడ్ ఫైనల్ విన్నర్ ని నిర్ణయిస్తుంది. ఐతే అసలైతే ఈ ఫైనల్ ఎపిసోడ్ కి అల్లు అర్జున్ ని తీసుకు రావాలని అనుకున్నారు కానీ కుదిరే పరిస్థితి కనిపించట్లేదు. సో హోస్ట్ నాగార్జునతోనే ఫైనల్ ఎపిసోడ్ ముగిస్తారా లేదా ఎవరైనా హీరోని తీసుకొస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ రేసు నిఖిల్, గౌతం ల మధ్య జరుగుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరిలోనే ఒకరు విజేత అయ్యే ఛాన్స్ ఉంది.