బిగ్ బాస్ 8 : లీస్ట్ ఓటింగ్ లో ఆ ఇద్దరు.. డేంజర్ ఎవరికి..?

ఇంతకీ ఓటింగ్ లో లాస్ట్ ఉన్న ఆ ఇద్దరు ఎవరంటే ఒకరు సీత మరొకరు పృధ్వి అని తెలుస్తుంది.

Update: 2024-10-10 11:11 GMT
బిగ్ బాస్ 8 : లీస్ట్ ఓటింగ్ లో ఆ ఇద్దరు.. డేంజర్ ఎవరికి..?
  • whatsapp icon

బిగ్ బాస్ సీజన్ 8 లో ఆరో వారం నామినేషన్స్ లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ హౌస్ లోకి వెళ్లారు. ఆదివారం హౌస్ లోకి వెళ్లగానే సోమవారమే నామినేషన్స్ పెట్టారు. ఐతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ బయట పాత కంటెస్టెంట్స్ ఆట చూసి వచ్చారు కాబట్టి వారి దగ్గర పాయింట్స్ ఉన్నాయి. సో అలా వారికి కనిపించిన, అనిపించిన పాయింట్స్ తో నామినేషన్స్ వేశారు. ఈ క్రమంలో యష్మి, సీత, పృధ్వి, విష్ణు ప్రియలను నామినేట్ చేశారు. ఐతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గా వచ్చిన రాయల్ క్లాన్ కంటెస్టెంట్స్ నుంచి కూడా ఇద్దరిని నామినేట్ చేయమని బిగ్ బాస్ చెప్పాడు.

 

అందులో నుంచి మెహబూబ్, గంగవ్వని నామినేట్ చేశారు. ఈ వారం ఆరుగురు నామినేషన్స్ లో ఉండగా వారిలో ఇద్దరికి లీస్ట్ ఓటింగ్ ఉందని తెలుస్తుంది. ఇంతకీ ఓటింగ్ లో లాస్ట్ ఉన్న ఆ ఇద్దరు ఎవరంటే ఒకరు సీత మరొకరు పృధ్వి అని తెలుస్తుంది. పృధ్వి టాస్కులు బాగా ఆడుతున్నా ఎందుకో టాప్ రేంజ్ కి వెళ్లలేకపోతున్నాడు. ఆడియన్స్ ను కనెక్ట్ అవ్వడంలో అతను వెనకపడుతున్నాడు. మరోపక్క సీత కూడా పెద్దగా టాస్కులు ఆడింది లేదు. అందుకే ఆమె కూడా లీస్ట్ ఓటింగ్ లో ఉంది.

బిగ్ బాస్ సీజన్ 8 లో ఆరో వారం షాకింగ్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే సీత, పృధ్విలలో పృధ్వి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి పృధ్వి ఎలిమినేట్ అయితే మాత్రం స్ట్రాంగ్ కంటెస్టెంట్ వెళ్లినట్టే అవుతుంది. వైల్డ్ కార్డ్స్ లో నామినేషన్స్ లో ఉన్న మెహబూబ్, గంగవ్వలకు మంచి ఓటింగ్స్ తో సేవ్ పొజిషన్ లో ఉన్నారు. వారితో పాటు యష్మి కూడా మంచి ఓటింగ్ రేటుతో ముందు ఉంది. విష్ణు ప్రియ మాత్రం సీత, పృధ్విల తర్వాత లీస్ట్ ఓటింగ్ లో ఉంది.

మరి ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఎలా ఉండబోతుంది. ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారన్నది చూడాలి. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 లో బీబీ హోటల్ టాస్క్ కొనసాగుతుంది. రాయల్, ఓజీ క్లాన్స్ మధ్య ఎంటర్టైన్మెంట్ యాంగిల్ లో ఈ టాస్క్ నడుస్తుంది.

Tags:    

Similar News