బిగ్ బాస్ 8 : హౌస్ మెట్స్ కోసం దీపావళికి ఊహించని సర్ ప్రైజ్..!
బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్స్ కి దీపావళి సర్ ప్రైజ్ గా వారి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మెసేజ్ వచ్చే ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్.
బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్స్ కి దీపావళి సర్ ప్రైజ్ గా వారి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మెసేజ్ వచ్చే ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. శుక్రవారం ఎపిసోడ్ లో మెగా చీఫ్ గా తిరుగుతూనే ఉండు గెలిచే వరకు టాస్క్ లో చివరి దాకా అవినాష్ తన బస్తాతో ఉన్నాడు కాబట్టి అతనే మెగా చీఫ్ అయ్యాడు. ఇక మరోసారి బిగ్ బాస్ ని ఎంటర్టైన్ చేయమని అవినాష్ ని బిగ్ బాస్ కోరాడు. ఈ క్రమంలో అతను మెగాస్టార్ చిరంజీవి, రాజశేఖర్ లాగా మిమిక్రీ చేశాడు.
ఇక నిన్న జరిగిన టాస్క్ గురించి నయని పావని, గౌతం ల మధ్య చిన్న గొడవ మొదలైంది. నయని సీరియస్ అవ్వడం గుర్తించిన గౌతం ఆమెను కూడా అక్క నేను ఆ ఉద్దేశంతో అనలేదు అంటూ ఏదో చెప్పబోయాడు. దానికి నయని పావని అక్క అని ఎందుకు పిలుస్తావ్ అని అక్కడ నుంచి లేచి వెళ్లి హౌస్ లోకి వెళ్లింది. ఇక బిగ్ బాస్ హౌస్ లో దీపావళి సెలబ్రేషన్స్ నిర్వహించారు. హౌస్ లో ఒక్కొక్క కంటెస్టెంట్ అన్న కొన్ని మాటలను కట్ చేసి వాటిని వినిపించాడు.
గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన ఫోన్ రింగ్ అవ్వగానే ఎవరో ఒకరు ఎత్తాల్సి ఉంటుంది. ఆ ఫోన్ ఎవరు ఎత్తితే వారి ఫ్యామిలీ మరో ఇంటి సభ్యుడి ఫ్యామిలీ మెసేజ్ అని చెబుతాడు. అలా కొందరు కొందరి ఫ్యామిలీ మెసేజ్ లు రాగా దీపావళి సందర్భంగా మిగతా వారి ఫ్యామిలీ మెసేజ్ లు కూడా చూపించాడు బిగ్ బాస్. ఆ తర్వాత హౌస్ లో క్రాకర్స్ కాల్చి దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు. బిగ్ బాస్ పండగ సాంగ్ వేస్తే హౌస్ మెట్స్ అంతా పండగని ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేశారు.
శుక్రవారం ఎపిసోడ్ లో పెద్దగా కంటెంట్ లేదు కేవలం హౌస్ మెట్స్ కి వారి ఇంటి నుంచి వచ్చిన మెసేజ్ లతోనే నిండిపోయింది. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఐదుగురు హౌస్ మెట్స్ ఉన్నారు. వారిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆదివారం తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 8 లో 9వ వారం యష్మి, హరితేజ, నయని పావని, తేజ, గౌతం నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఒకరి ఆదివారం హౌస్ ని వీడి వెళ్తారు. ఐతే ఓటింగ్ అనాలిసిస్ పకారం నయని, హరితేజల మధ్యలోనే ఎలిమినేషన్ ఉంటుందని తెలుస్తుంది. ఐతే తేజ కూడా వీరిద్దరి తర్వాత లీస్ట్ ఓటింగ్ తో ఉన్నాడు.