బిగ్ బాస్ 7 : రంగులద్దడంలో రచ్చ రంబోలా.. ఈ సీజన్ ఫస్ట్ కెప్టెన్ ఎవరంటే..?
సీజన్ 7 మొదటి ఇంటి కెప్టెన్ గా పల్లవి ప్రశాంత్ గెలుపొందాడు. రైతు బిడ్డగా హౌస్ లోకి వచ్చిన పల్లవి ప్రశాంత్ రోజు రోజుకి తన గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు.
బిగ్ బాస్ సీజన్ 7 మొదటి కెప్టెన్సీ టాస్క్ శుక్రవారం పూర్తైంది. ఎపిసోడ్ చివరి వరకు రసవత్తరంగా ఎవరు కెప్టెన్ అవుతారన్నట్టుగా ఎగ్జైట్ మెంట్ ఉండింది. సీజన్ 7 లో మొదటి కెప్టెన్సీ టాస్క్ లో సందీప్, తేజ, పల్లవి ప్రశాంత్, గౌతం కృష్ణ పాల్గొన్నారు. సర్కిల్ లో ఒక్కొక్కరికి ఒక్కో రంగు ఇచ్చి అవతల వ్యక్తి మీద రంగు పడేలా చేయాలి. ఈ ఫైట్ లో మూడు బజర్ లు ఉంటాయి. బజర్ కి బజర్ మధ్య టైం లో ఎవరి షర్ట్ మీద ఎక్కువ రంగు మరకలు ఉంటాయో వారు పోటీ నుంచి తప్పుకున్నట్టు అవుతుంది.
ఈ టాస్క్ కి సంచాలక్ గా ప్రియాంకాని ఎంచుకున్నాడు బిగ్ బాస్. అయితే మొదటి రౌండ్ ని ముందు సందీప్ అని అనౌన్స్ చేసిన ప్రియాంక మళ్లీ తన నిర్ణయం మార్చుకుని తేజని ఎలిమినేట్ చేసింది. రెండో రౌండ్ లో సందీప్ మాస్టర్ బయటకు వచ్చాడు. ఇక గౌతం కృష్ణ వర్సెస్ పల్లవి ప్రశాంత్ మధ్య ఫైనల్ రౌండ్ లో పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. సీజన్ 7 మొదటి ఇంటి కెప్టెన్ గా పల్లవి ప్రశాంత్ గెలుపొందాడు. రైతు బిడ్డగా హౌస్ లోకి వచ్చిన పల్లవి ప్రశాంత్ రోజు రోజుకి తన గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు.
అతనికి హౌస్ లో శివాజి సపోర్ట్ అందిస్తున్నారు. ఇక పల్లవి ప్రశాంత్ గెలుపు మీద అమర్ దీప్, సందీప్ అసంతృప్తిగా ఉన్నారు. ఇంటి కెప్టెన్ గా ఈ సీజన్ లో పల్లవి ప్రశాంత్ మొదటి కంటెస్టెంట్ గా బాధ్యత తీసుకున్నాడు. కెప్టెన్ గా గెలిచిన వారికి సూపర్ ఇమ్యూనిటీ తో పాటుగా కొన్ని సౌకర్యాలు ఉంటాయి. అవేంటి అన్నది ఈ వీకెండ్ హోస్ట్ నాగార్జున అనౌన్స్ చేస్తారు.
లాస్ట్ వీక్ లోనే పవర్ అస్త్ర గెలిచిన పల్లవి ప్రశాంత్ మళ్లీ అదే దూకుడుతో కెప్టెన్సీ టాస్క్ కూడా విన్ అయ్యాడు. కుర్రాడి దూకుడు చూస్తుంటే టాప్ 5 లో నిలిచేలా ఉన్నాడు. అయితే ఈ వారం మరో ఏడుగురు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారని టాక్. వారిలో సీరియల్ యాక్టర్స్ ఎక్కువగా ఉంటారని అంటున్నారు. ఈ వీకెండ్ ఒకరు ఎలిమినేట్ ఐతే మరో ఏడుగురు కంటెస్టెంట్స్ హౌస్ లోకి వస్తారని తెలుస్తుంది.