బిగ్ బాస్ 8 : ఎవరు స్ట్రాంగ్.. ఎవరు వీక్..?

సోనియా ఐతే మొదటి రెండు మూడు రోజులు ఫైర్ చూపించి ఆ తర్వాత డల్ అయ్యింది. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న సోనియా శనివారం సేఫ్ అయ్యింది.

Update: 2024-09-08 04:00 GMT

బిగ్ బాస్ సీజన్ 8 ఫస్ట్ వీక్ పూర్తైంది. 14 మంది కొత్త కంటెస్టెంట్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 8 లో ఫస్ట్ వీక్ లో కంటెస్టెంట్స్ ఆడిన టాస్కులు, మాట్లాడిన విధానం, చేసిన కామెంట్స్ పై ఆడియన్స్ ఒక అంచనాకు వచ్చారు. ఈ వారం మొత్తం నిఖిల్ లీడర్ షిప్ క్వాలిటీస్ బాగానే ఉన్నా కొందరికి మాత్రమే అతను ప్రిఫరెన్స్ ఇస్తున్నారన్న టాక్ ఉంది. సోనియా ఐతే మొదటి రెండు మూడు రోజులు ఫైర్ చూపించి ఆ తర్వాత డల్ అయ్యింది. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న సోనియా శనివారం సేఫ్ అయ్యింది.

ఇక బెజవాడ బేబక్క వంట చేయడం వరకు ఓకే కానీ అదేదో ఆమె ఇంట్లో పరిచయం లేని వ్యక్తులు వచ్చి సొంత వంట చేసుకోవడం నచ్చదు అన్నట్టుగా కిచెన్ లో తన ఆధిపత్యం చూపించింది. అందుకే నామినేషన్స్ లో ఆమెకే లీస్ట్ ఓటింగ్ వచ్చినట్టు టాక్. ఇక నాగ మణికంఠ ఈ వారం తన ఫ్యామిలీ స్టోరీ చెప్పి ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసుకోవాలని చూసినా హౌస్ మెట్స్ మాత్రం అతనితో జాగ్రత్తగా ఉండాలని అనుకున్నారు. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న మణికంఠ ఈ వారం సేఫ్ అయినట్టే అని చెప్పుకుంటున్నారు.

ఇక ప్రేరణ ఇంకా ఆట మొదలు పెట్టలేదు. అయితే మాట్లాడే మాటలు మాత్రం పాయింట్ టు పాయింట్ ఉన్నాయి. యష్మి కి లక్ బాగా కలిసి వస్తుంది. ముందు చీఫ్ అయ్యింది ఆ తర్వాత అతి పెద్ద క్లాన్ కెప్టెన్ అయ్యింది. ఆమె ఆట ఆడకపోయినా కలిసి వస్తున్నందుకు హౌస్ మెట్స్ కాస్త అసంతృప్తిగా ఉన్నారు. ఆదిత్య ఓం ఇంకా ఆట మొదలు పెట్టలేదు. ఆటలో ఇన్వాల్వ్ మెంట్ పెంచుకోవాలి పృధ్వి రాజ్ కొన్ని పాయింట్స్ బాగానే మాట్లాడుతున్నా ఇంకా టఫ్ ఫైట్ ఇవ్వాల్సి ఉంది.

అభయ్ నవీన్ తను చెప్పాలనుకున్న పాయింట్ బాగానే చెబుతున్నాడు ఐతే టాస్కుల్లో ఇంకాస్తర్ బెటర్ వర్క్ చేయాల్సి ఉందనిపిస్తుంది. విష్ణు ప్రియ ఇంక తన రియల్ గేమ్ స్టార్ట్ చేయలేదనిపిస్తుంది. వారం రోజుల్లో ఆమె తన స్థాయికి తగిన ఆట ఆడలేదు. నబీల్ అఫ్రిది టాస్కుల్లో దూకుడుగా ఉన్నాడు. ఐతే హౌస్ యాక్టివిటీస్ లో ఎక్కువగా కనిపించట్లేదు. శేఖర్ బాషా తనేదో పిక్ నిక్ కి వచ్చినట్టు సరదాగా ఉన్నాడు. ఏ విషయాన్ని సీరియస్ గా తీసుకోవట్లేదు.

కిరాక్ సీత తన లో మ్యాటర్ ఉన్నట్టు కనిపిస్తున్న ఆమె స్ట్రెంగ్ ఎక్కడ చూపించాలో కన్ ఫ్యూజ్ అవుతుంది. నైనిక ఇప్పటికే ఆటలో తన సత్తా చాటగా కొన్ని విషయాల్లో కాస్త తెలివి ప్రదర్శించాల్సి ఉంది. ఇలా 14 మంది కంటెస్టెంట్స్ వారి వారి బలాలు బలహీనతలు మొదటి వారం లోనే బయట పెట్టారు.

ఈ సీజన్ మొదటి ఎలిమినేషన్ తోనే బాబోయ్ అనిపించేలా ఫైట్ చేసిన ఈ హౌస్ మెట్స్ రెండో వారం నామినేషన్స్ లో ఇంకెంత హంగామా చేస్తారన్నది చూడాలి.

Tags:    

Similar News