20 ఏళ్ల‌కే పెళ్లి షాక్ ఇచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్!

కానీ త‌న‌క‌న్నా ఏడాది చిన్న వ‌యసులో ఉన్న అమ్మాయినే వివాహం చేసుకుంటున్నాడు.

Update: 2024-05-10 07:15 GMT

'బిగ్ బాస్ 16' కంటెస్టెంట్ -తజికిస్థాన్ గాయకుడు అబ్దు రోజిక్ సుప‌రిచిత‌మే. 'బిగ్ బాస్' షోతో ఇండియాలో బాగా ఫేమ‌స్ అయ్యాడు. తాజాగా రోజికి పెళ్లికి సిద్ద‌మ‌య్యాడు. వివాహ బంధంతో ధాంపత్య జీవితంలోకి అడుగు పెడుతున్న‌ట్లు తెలిపాడు. దీంతో అప్పుడే అత‌నికి పెళ్లి ఏంటి? అంతా షాక్ అవుతున్నారు. ఎందుకంటే అబ్దుల్ కి ఇంకా 20 ఏళ్లే. కానీ త‌న‌క‌న్నా ఏడాది చిన్న వ‌యసులో ఉన్న అమ్మాయినే వివాహం చేసుకుంటున్నాడు.


ఆమె పేరు అమీరా. ఇద్ద‌రిది ప్రేమ వివాహంగా తెలుస్తుంది. త‌న ప్రేమ‌ను వెల్ల‌డిస్తూ ఎంగేజ్ మెంట్ రింగును కూడా అభిమానులకు సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేసాడు. 'ప్రేమ కంటే విలువైనది నా జీవితంలో ఇంకేది లేదు. పెళ్లి చేసుకోవ‌డానికి సిద్దంగా ఉన్నాను. జీవితంలో ఇదో కొత్త ప్ర‌యాణం. ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురుచూస్తున్నాను. దైనందిన జీవితం లో పెళ్లి అవ‌స‌రం అని గ్ర‌హించాను. అందుకే ప్రేమ పెళ్లి. కానీ ఈ ప్రేమ నాకు అంత ఈజీగా ద‌క్క‌లేదు.

చాలా అడ్డంకులు...అవ‌రోధాలు ఎదుర్కుని ఇంత‌వ‌ర‌కూ వ‌చ్చాను. ల‌వ్ జ‌ర్నీ కాస్త నాకు స‌వాల్ గానే అనిపించింది. అమీరా-నేను ఒక‌ర్ని ఒకరు ఇష్ట‌ప‌డ్డాం. నాకు 20 ఏళ్లు అని అంద‌రికీ తెలుసు. కానీ నేను నేను ప్రేమలో పడాలని - నన్ను ఎక్కువగా గౌరవించే - ప్రేమించే వ్యక్తిని పొందాలని కలలు కన్నాను. అనుకోకుండా నాకు అమీరా దొరికింది. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. నన్ను ప్రేమించే అమ్మాయి దొర‌క‌డం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను.

నా జీవితంలో ఇలా జ‌రుగుతుంద‌ని ఎప్పుడూ ఊహించ‌లేదు. జూలై 7 తేదీని సేవ్ చేయండి' అంటూ పెళ్లి తేదిని రివీల్ చేసాడు. ప్ర‌స్తుతం ఈ వార్త వైర‌ల్ గా మారింది. అభిమానులు రోజిక్ అడ్వాన్స్ గా విషెస్ తెలియ‌జేస్తున్నారు. అయితే ప్రియురాలి ఫోటోని మాత్రం రోజిక్ రివీల్ చేయ‌లేదు.

Tags:    

Similar News