బిగ్ బాస్ 7 : హౌస్ లో ఫ్యామిలీ వీక్.. మొదట ఎవరు వచ్చారంటే..!

మొత్తానికి ఫ్యామిలీ వీక్ లో మొదటి రోజే శివాజి కొడుకుని పంపించి షో మీద ఆసక్తి పెరిగేలా చేశారు బిగ్ బాస్ టీం.

Update: 2023-11-07 10:05 GMT

బిగ్ బాస్ సీజన్ 7 లో ఈ వారం ఫ్యామిలీ వీక్ కానుంది. హౌస్ మేట్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ వారి కోసం బిగ్ బాస్ హౌస్ లోకి వస్తారు. ప్రతి సీజన్ ఇలాంటి ఒక ఎపిసోడ్ ఆడియన్స్ ని బాగా అలరిస్తుంది. ప్రతి సీజన్ లానే ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ గా సాగనుంది. ఈ సీజన్ లో మొదట హౌస్ లోకి శివాజి పెద్ద కొడుకు ఎంట్రీ ఇచ్చాడు. అతను ఒక డాక్టర్ లాగా వచ్చి శివాజి చేయి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. శివాజి వచ్చింది తన కొడుకు అని తెలుసుకోలేకపొయాడు. శివాజి వెళ్తున్న టైం లో నాన్న అని అంటాడు. ఒక్కసారిగా శివాజి ఎమోషనల్ అయ్యి కొడుకుని దగ్గరకు తీసుకుని కన్నీళ్లు పెడతాడు.

ఇక హౌస్ లోకి కొడుకుని తీసుకుని వెళ్లి మై సన్ అని అందరికీ పరిచయం చేస్తాడు. దీనికి సంబందించిన ప్రోమో రిలీజ్ అవగా బిగ్ బాస్ ఆడియన్స్ ని ఈ ప్రోమో అలరిస్తుంది. నువ్వు వస్తావని అనుకోలేదని శివాజి కొడుకుతో అంటాడు. హౌస్ లో నువ్వు కన్నీళ్లు పెట్టవద్దని నువ్వు ఏడిస్తే మేమంతా అక్కడ ఏడుస్తామని అన్నారు. మొత్తానికి ఫ్యామిలీ వీక్ లో మొదటి రోజే శివాజి కొడుకుని పంపించి షో మీద ఆసక్తి పెరిగేలా చేశారు బిగ్ బాస్ టీం.

నాలుగు వారాలుగా శివాజి తన చేయి బాగా లేకపోయినా సరే ఆట ఆడుతున్నాడు. రెండు రోజులకు ఒకసారి బాగా పెయిన్ వచ్చినప్పుడు డాక్టర్స్ అందుబాటులో ఉంటుండగా చేయి నొప్పి దాదాపు తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇక ఈ సీజన్ టఫ్ ఫైటర్ గా ఉంటూ వచ్చిన శివాజి టాప్ 3 లో పక్కా ఉంటాడని ఆడియన్స్ భావిస్తున్నారు.

శివాజి తన ఆటతో పాటుగా పల్లవి ప్రశాంత్, యావర్ లను కూడా ప్రోత్సహిస్తూ వచ్చాడు. శివాజితో పాటుగా టాప్ 5లో వీరిద్దరికి కూడా ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు. ఇక స్టార్ మా బ్యాచ్ లో కూడా టాప్ 5కి అమర్, అర్జున్ పోటీ పడుతున్నారు. మరి వీరిలో ఈ సీజన్ టాప్ 5 ఎవరు అవుతారన్నది చూడాలి. ఈ సీజన్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడంలో సూపర్ సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు.

Full View
Tags:    

Similar News