హిట్ లిస్ట్ లో నెంబర్ వన్...వెరీ డేంజన్ జోన్ లో!
బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు ఉన్న థ్రెట్ అనవాళ్ల నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారంతా.
బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు ఉన్న థ్రెట్ అనవాళ్ల నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారంతా. కొన్ని రోజులుగా వ్యవహారమంతా స్తబ్ధుగా ఉండటంతో? ఆ రకమైన వాతావరణం నుంచి సల్మాన్ కూడా బయటకు వస్తున్నట్లు కనిపిస్తుంది. అలాగని ఇంకా భద్రతను దూరం చేయలేదు. అన్నిరకాల భద్రతా దళాల మధ్యనే సల్మాన్ ఉన్నాడు. బాబా సిద్దీఖి హత్య ఉదంతోనే ఇదంతా చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
అయితే తాజాగా విచారణ బృందాల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. బాబా సిద్దీఖి హత్యకంటే ముందే సల్మాన్ ఖాన్ ని హత్య చేయాలని షూటర్లు ప్లాన్ చేసినట్లు వెలుగులోకి వచ్చింది. కానీ అది సాధ్యం కాకపోవడంతో ఎన్ సీపీ నేత బాబా సిద్దీఖిని హత్య చేసినట్లు దర్యాప్తు బృందాలు ఇంటరాగేషన్ లో గుర్తించాయి. తమ హిట్ లిస్ట్ సల్మాన్ ఖాన్ టాప్ లో ఉన్నట్లు తేలింది.
తొలుత సల్మాన్ ఖాన్ నే చంపాలని తమకి స్పష్టమైన ఆదేశాలున్నాయని నిందుతులు చెప్పారు. ఆ క్రమంలోనే నిందితులు సల్మాన్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. కానీ ఆయన భద్రత పటిష్టంగా ఉండటంతో సాధ్యపడలేదు. ఈ క్రమంలోనే సిద్దీఖిని టార్గెట్ చేసినట్లు..దీనికి సంబంధించిన వాంగ్మూలాలు, డిజిటల్ ఆధారాలను కూడా అధికా రులు సేకరించారు. దీంతో సల్మాన్ ఖాన్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మరోసారి స్పష్టమైంది.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఇప్పటికే సల్మాన్ ఖాన్ ని హత్య చేస్తామని బెదిరించడంతో ఆయనకు వైప్లస్ కేటగిరీ భద్రత ను ప్రభుత్వం కల్పించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెండు ఎస్కార్ట్ వాహనాలతో సహా దాదాపు 60 మంది సిబ్బంది సల్మాన్ ఖాన్ రక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.