ఆ బ్యూటీ ఫ్యామిలీ వెకేషన్ కాక పుట్టించేలా!
బాలీవుడ్ నటి పెళ్లైన నాటి నుంచి ప్రోఫెషనల్ కెరీర్ కంటే ఫ్యామిలీ లైఫ్ మీదనే ఎక్కువగా ఏకాగ్రత చూపిస్తోంది.
బాలీవుడ్ నటి పెళ్లైన నాటి నుంచి ప్రోఫెషనల్ కెరీర్ కంటే ఫ్యామిలీ లైఫ్ మీదనే ఎక్కువగా ఏకాగ్రత చూపిస్తోంది. భర్త అనంద్ అహుజాతో వివాహం తర్వాత అమ్మడు న్యూయార్క్ లో కాపురం పెట్టిన నాటి నుంచి సినిమాలుంటే ముంబైకి రావడం లేదంటే? కుటుంబ జీవితంతోనే మమేకం అన్నట్లే లైప్ లో కి ముందుకు సాగుతోంది. తాజాగా అమ్మడు ఫ్యామిలీతో మాల్దీవుల వెకేషన్ ని ఆస్వాదిస్తోంది.
తన భర్త ఆనంద్ అహూజా - వారి పూజ్యమైన కుమారుడితో కలిసి మాల్దీవుల అందాల్లో మునిగి తేలుతు న్నారు. కుమారుడితో కలిసి సోనమ్ కపూర్ ఎంచక్కా చిన్న పిల్లలా మారిపోయి ఆటలు ఆడుకుంటుంది. ఓవైపు కొడుకును ఆడిస్తూనే తాను సైతం సై అంటూ స్విమ్ షూట్ లో దూరేసి రచ్చ రచ్చ చేస్తోంది. బ్లాక్ కలర్ స్విమ్ షూట్ లో ఏమాత్రం తగ్గలేదు. బీచ్ బ్యూటీని పర్పెక్ట్ గా ప్లాన్ చేసుకుని ఆస్వాదిస్తోంది.
అమ్మడు స్పాట్ నుంచి కొన్ని అందమైన సెల్పీలు ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ గా మారాయి. కపూర్ బ్యూటీ నేచురల్ అందంతో యువతని అలరిస్తుంది. మరోవైపు తడిపోడి అందాలతో కవ్విస్తుంది. స్పాట్ లో తీవ్రమైన ఎండ వీస్తున్నా? జలకాలటలో మాత్రం ఎక్కడా తగ్గలేదు. వచ్చిందే ఆస్వాదనకంటూ ఒక్క క్షణం కూడా వృద్దా చేయకుండా మాల్దీవుల అందాల్ని ఆస్వాదిస్తోంది.
ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కపూర్ బ్యూటీ అభిమానులు వాటిని చూసి ఆస్వా దించడం తమ వంతు అయింది. గత ఏడాది `బ్లైండ్` చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సోనమ్ కపూర్ ఆ తర్వాత మళ్లీ ఇంత వరకూ కొత్త చిత్రాన్ని ప్రకటించలేదు.