వరుస ఫ్లాపుల్లో ఉన్నా అరడజను ఆఫర్లు
దీనికి కారణం ఇటీవలి భారీ మల్టీస్టారర్ ట్రెండ్. ఫ్లాప్ హీరోని ఏదో ఒక మల్టీస్టారర్ లో ఎలా వినియోగించుకోవాలో తెలివైన దర్శకులకు తెలుసు. అలాంటి కథల్ని కూడా వీళ్లు వండి వారుస్తున్నారు.
ఒకప్పుడు ఫ్లాప్ ఇస్తే ఆ హీరోకి మరో అవకాశం ఇచ్చేందుకు ఆలోచించేవారు. కానీ ఇటీవలి కాలంలో ఈ పరిస్థితి లేదు. ఫ్లాప్ వస్తే పారితోషికంపై ప్రభావం పడుతోందేమో కానీ, అవకాశాలకు కొదవేమీ లేదు. దీనికి కారణం ఇటీవలి భారీ మల్టీస్టారర్ ట్రెండ్. ఫ్లాప్ హీరోని ఏదో ఒక మల్టీస్టారర్ లో ఎలా వినియోగించుకోవాలో తెలివైన దర్శకులకు తెలుసు. అలాంటి కథల్ని కూడా వీళ్లు వండి వారుస్తున్నారు.
ఫలితం ఏదైనా కానీ జయాపజయాలతో సంబంధం లేకుండా అవకాశాలు అందుకుంటున్న స్టార్లలో అక్షయ్ కుమార్, రణ్ వీర్ సింగ్ వంటి ప్రముఖులు ఉన్నారు. అక్షయ్ కుమార్ గత రెండేళ్లుగా అరడజను పైగా భారీ డిజాస్టర్లను అందించాడు. కానీ ఇప్పటికీ అతడు ఆరేడు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. అక్షయ్ నటించేవాటిలో మెజారిటీ భాగం మల్టీస్టారర్లే. అతడు నటించిన స్కై ఫోర్స్, శంకర బ్యాక్ టు బ్యాక్ విడుదలకు సిద్ధమవుతున్నాయి. వీటి తర్వాత జాలీ LLB 3 వస్తుంది. తర్వాత 2025 చివరిలో వెల్‌కమ్ టు ది జంగిల్ వస్తోంది. విష్ణు మంచు కన్నప్పలో అతడు శివుడి పాత్రలో కనిపిస్తాడు. వెల్ కం టు ది జంగిల్ భారీ మల్టీస్టారర్ కేటగిరీలో వస్తోంది.
సన్నీ డియోల్ చాలా ఫ్లాపుల తర్వాత ఒక బ్లాక్ బస్టర్ తో కంబ్యాక్ అయ్యాడు. కానీ అతడు వరుస హిట్లతో నిరూపించుకోవాల్సి ఉంది. ప్రస్తుతం జాత్, బోర్డర్ 2 విడుదల కానున్నాయి. అతడు మరిన్ని సినిమాలకు సంతకాలు చేసాడు. సౌత్ లో మైత్రి మూవీ మేకర్స్ తో అతడు సినిమా చేస్తున్నాడు. భారీ ఫ్లాపుల్లో ఆల్మోస్ట్ తెరమరుగైపోయిన సన్నీడియోల్ ఇప్పుడు గ్రేట్ కంబ్యాక్ కోసం ప్రయత్నిస్తున్న తీరు ఆశ్చర్యపరుస్తోంది.
టైగర్ ష్రాఫ్ లాంటి యువప్రతిభావంతుడు కొన్ని వరుస డిజాస్టర్ల తర్వాత కంబ్యాక్ కోసం భాఘి 4 ని నమ్ముకున్నాడు. ఈ చిత్రంతో నిరూపించుకుని తిరిగి వరుస సినిమాలను ప్రకటించాలని పట్టుదలగా ఉన్నాడు. ప్రస్తుతం అతడు పారితోషికం తగ్గించుకుని నటిస్తున్నాడు. దీంతో అవకాశాలొస్తున్నాయని సమాచారం. అలాగే సిద్ధార్థ్ మల్హోత్రా `పరం సుందరి`తో నిరూపించుకోవాలని గట్టి ప్రయత్నంలో ఉన్నాడు. అతడికి కూడా ఇటీవల సరైన విజయాల్లేవ్. అలాగని ఆఫర్లకు కొదవేమీ లేదు. చాలా సినిమాల కథలు విని దర్శకులను క్యూలో ఉంచాడు. సరైన సమయంలో అతడు ప్రకటించే వీలుంది. ఫ్లాపుల్లో ఉన్నా అవకాశాలకు కొదవేమీ లేదు. ఈ పరిస్థితి కేవలం హిందీ హీరోలకే వర్తించదు. ఇటు టాలీవుడ్ హీరోలకు కూడా వర్తిస్తుంది. తెలుగు చిత్రసీమలోను ఫ్లాప్ హీరోలు ఖాళీగా లేరు. పలు మల్టీస్టారర్లలో ఇతర హీరోలతో కలిసి నటిస్తుండడం నయా ట్రెండ్ గా మారింది.