పిక్ టాక్ : అందాల దంగల్ లో చిత్తు చేసింది
ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న సినిమాల విషయానికి వస్తే మెట్రో... ఇన్ డినో మరియు ఉల్ జులూల్ ఇష్క్ సినిమాల్లో నటిస్తుంది.
చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించిన ఫాతిమా సనా షేక్ 2016 లో వచ్చిన దంగల్ సినిమాతో నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ సినిమాలో అమీర్ ఖాన్ కూతురుగా నటించిన ఫాతిమా ఆ తర్వాత హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. దంగల్ లో అమీర్ ఖాన్ కి కూతురు పాత్రలో నటించిన ఫాతిమా ఆ తర్వాత చేసిన థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమాలో ఆయనకు ప్రియురాలి పాత్రలో నటించడం ద్వారా అందరికి షాక్ ఇవ్వడం కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది.
ఫాతిమా సనా షేక్ అందం విషయంలో స్టార్ హీరోయిన్స్ కి పోటీ ఇవ్వగలదు, నటన విషయంలో కూడా కచ్చితంగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకునే స్థాయిలోనే నటిస్తుంది. అయినా కూడా కొన్ని సార్లు ఈ అమ్మడు వివాదాల్లో నిలవడం వల్ల దక్కాల్సిన ఆఫర్లు దక్కలేదు అనేది కొందరి అభిప్రాయం. చాలా సినిమాలు ఈమె చెంతకు వచ్చి వెనక్కి వెళ్లి పోయాయి అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. తనకు వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటూ కెరీర్ లో ముందుకు వెళ్తున్న ఫాతిమా సనా షేక్ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది.
తాజాగా మరోసారి ఈ అమ్మడు అందాల ఫోటోలను షేర్ చేసింది. సాధారణంగా ఈ అమ్మడు ఎక్కువగా అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఈమె స్కిన్ షో కి నెటిజన్స్ నుంచి మంచి స్పందన వస్తూ ఉంటుంది. అలాంటి అందాల ఫాతిమా సనా షేక్ అనూహ్యంగా ఈసారి ఫుల్ బ్లూ కలర్ డ్రెస్ తో కన్నుల విందు చేసింది. ఆకట్టుకునే అందం తో పాటు మంచి ఫిజిక్ తన సొంతం అంటూ ఈ ఫోటోలతో మరోసారి నిరూపితం చేసింది. ఫాతిమా ఫ్యాషన్ ఐకాన్ అంటూ ఈ ఫోటోలకు నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తూ లైక్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న సినిమాల విషయానికి వస్తే మెట్రో... ఇన్ డినో మరియు ఉల్ జులూల్ ఇష్క్ సినిమాల్లో నటిస్తుంది. ఈ రెండు సినిమాలు కాకుండా మరో రెండు మూడు సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ అమ్మడు సౌత్ లో కూడా నటించాలని సౌత్ ఆడియన్స్ కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈ అమ్మడికి ఉన్న క్రేజ్ తో సినిమాల్లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు దక్కించుకోవచ్చు. కానీ ఈమె ఆచితూచి ఎంపిక చేసుకుంటుందని, సౌత్ నుంచి వస్తున్న ఆఫర్లను సున్నితంగా తిరస్కరిస్తుందనే టాక్ వినిపిస్తుంది.
బాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో ఫాతిమా సనా షేక్ గురించిన పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా ఒక సీనియర్ హీరో తో ఈమె లవ్ అఫైర్ కొనసాగిస్తుందనే పుకార్లు పెద్ద ఎత్తున వచ్చాయి. కానీ తాను ఏ ఒక్కరితో రిలేషన్ లో లేను అంటూ తేల్చి చెప్పింది. చిన్నతనంలోనే తాను ప్రేమలో పడ్డాను. ఆ సమయంలోనే తనకు ప్రేమ అనేది సెట్ అవ్వదు అని అర్థం అయ్యింది. అందుకే ఇకపై తాను ప్రేమలో పడబోను అంటూ తేల్చి చెప్పింది. ఆ హీరోతో కూడా ఎలాంటి రిలేషన్ లేదు అంటూ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది.