వరల్డ్ కప్ ని కమ్మేస్తోన్న బాలీవుడ్!
ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న 'టైగర్ -3' ప్రమోషన్ కూడా వరల్డ్ కప్ లోనే నిర్వహిస్తున్నారు.
బాలీవుడ్ వరల్డ్ కప్ ని టార్గెట్ చేసిందా? ప్రపంచ కప్ ని వేదికగా చేసుకుని కోట్ల రూపాయల పబ్లిసటీ ప్లాన్ చేస్తోందా? అంటే అవుననే తెలుస్తోంది. వరల్డ్ కప్ పుణ్యమాని ప్రపంచ దేశాల ప్రజలంతా ఇండియాలోనే ఉన్నారు. ఇప్పటికే మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఈనెల 14 అహ్మదాబాద్ వేదికగా పాక్-ఇండియా మ్యాచ్ జరుగుతుంది. ఈ సందర్భంగా పాకిస్తాన్ వార్ నేపథ్యంలో తెరకెక్కిన 'సామ్ బహుదూర్' ప్రచార చిత్రం రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
సరిగ్గా దాయాది తో తలపడుతోన్న సమయంలోనే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయడం ఇంట్రెస్టింగ్. ఈ నేపథ్యంలో తాజాగా సల్మాన్ ఖాన్ కూడా వరల్డ్ కప్ పై పడ్డట్లు తెలుస్తోంది. ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న 'టైగర్ -3' ప్రమోషన్ కూడా వరల్డ్ కప్ లోనే నిర్వహిస్తున్నారు. పాక్-భారత్ మ్యాచ్ లోనే ఈసినిమా ప్రచారం చేస్తున్నారు. దీని కోసం వరల్డ్ కప్ బ్రాడ్ కాస్ట్ నెట్ వర్క్ అయిన స్టార్ స్పోర్స్ట్ తో నిర్మాణ సంస్థ ఒప్పందం చేసుకుంది.
దీంతో వరల్డ్ కప్ అంతా 'టైగర్ 3' ప్రమోషన్ తో నిడిపోతుందని తెలుస్తోంది. ఈప్రచారం కోసం సల్మాన్ ఖాన్ క్రికెట్ వరల్డ్ కప్ కో బ్రాండింగ్ ప్రోమోస్ లోనూ నటించారు. వీటిని కీలక మ్యాచ్ ల మధ్యలో ప్రదర్శిచనున్నారు. 2019 లో జరిగిన ప్రపంచ కప్ ని 500మిలియన్లకు పైగా వీక్షించారు. అందులో ప్రత్యేకంగా పాకిస్తాన్ -ఇండియా మ్యాచ్ ని 200మిలియన్ల మందికి పైగా వీక్షించారు. ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరగనుందని నివేదికలు చెబుతున్నాయి.
దీంతో' టైగర్ 3' ప్రచారం చేయడం మాస్టార్ ప్లాన్ అంటూ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది కేవలం ఈ రెండు సినిమాలకే కాదు. ఇంకా ఈ వరుసలో చాలా సినిమాలు వస్తాయి. వరల్డ్ కప్ ఇవి ఆరంభ మ్యాచులే. సిసలైన మ్యాచ్ ల్లో ఇంకా అప్ కమింగ్ రిలీజ్ లు అన్ని ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది.